Image used for representational purpose only. | File Photo

Noida, September 1: గ్రేటర్ నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ యాప్ స్విగ్గీకి చెందిన ఓ డెలివ‌రీ ఏజెంట్‌.. రెస్టారెంట్ ఓన‌ర్‌ను (Kills Restaurant Owner ) చంపాడు. ఆర్డ‌ర్ ఆల‌స్య‌మైన కార‌ణంగా అత‌డు ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు (Swiggy Delivery Boy Shoots) పోలీసులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న ఆ డెలివ‌రీ ఏజెంట్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సునీల్ అనే వ్య‌క్తి గ్రేట‌ర్ నోయిడాలోని (Greater Noida) మిత్రా సొసైటీలో జామ్ జామ్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఓ స్విగ్గీ డెలివ‌రీ ఏజెంట్ ఆర్డ‌ర్‌ను పిక‌ప్ చేసుకోవ‌డానికి రెస్టారెంట్‌కు వ‌చ్చాడు.

ఒక ఆర్డ‌ర్‌ను వెంట‌నే ఇచ్చిన రెస్టారెంట్‌లో ప‌ని చేసే వ్య‌క్తి.. మ‌రో ఆర్డ‌ర్ లేట‌వుతుంద‌ని చెప్పాడు. దీంతో స‌ద‌రు ఏజెంట్ ఆ వ్య‌క్తితో గొడ‌వ‌కు దిగాడు. గొడ‌వ‌ను అడ్డుకోబోయిన య‌జ‌మాని సునీల్‌ను ఆ స్విగ్గీ డెలివ‌రీ బోయ్ కాల్చాడు.

ఢిల్లీలో మహిళలపై ఆగని అత్యాచారాలు, తాజాగా 13 ఏళ్ల బాలికపై విరుచుకుపడిన కామాంధుడు, ఆపై హత్య చేసి దహన సంస్కారాలు వెంటనే పూర్తి చేయాలని తల్లిదండ్రులకు బెదిరింపులు

వెంట‌నే సునీల్‌ను హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లినా.. అత‌డు అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. ఆ డెలివ‌రీ ఏజెంట్‌తోపాటు మ‌రో వ్య‌క్తి కూడా ఉన్నాడ‌ని, వాళ్లు అప్ప‌టికే ఆల్క‌హాల్ మ‌త్తులో ఉన్న‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెప్పారు.