Maharashtra: థానేలో దారుణం, మహిళ గొంతు నులిమి, తలను బాది హత్య చేసిన అగంతకులు, కనపడకుండా మహిళ మృతదేహాన్ని సోఫా బెడ్‌ లోపల దాచేశారు., కేసు నమోదు చేసుకున్న పోలీసులు

ముంబై నగరంలో మహిళను హత్య చేసి మృతదేహాన్ని (Woman's Dead Body ) సోఫా బెడ్‌ లోపల దాచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డోంబివిలిలో నివాసం ఉంటున్న 33 ఏండ్ల సుప్రియా షిండే మంగళవారం తన ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది.

Dead Representational Image (Photo Credits ANI)

Thane, Feb 17: మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబై నగరంలో మహిళను హత్య చేసి మృతదేహాన్ని (Woman's Dead Body ) సోఫా బెడ్‌ లోపల దాచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డోంబివిలిలో నివాసం ఉంటున్న 33 ఏండ్ల సుప్రియా షిండే మంగళవారం తన ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది. ఆ రోజు ఉదయం తనకు ఒంట్లో బాగోలేదని, కుమారుడ్ని స్కూల్‌కు తీసుకెళ్లాలని పొరుగింటి వ్యక్తిని కోరింది. అయితే స్కూల్‌ తర్వాత కూడా కుమారుడ్ని ఆమె తీసుకెళ్లలేదు.

దీంతో స్కూల్‌ టీచర్‌ ఆ మహిళ పొరుగింటి వారిని సంప్రదించారు. అయితే సుప్రియా ఇంట్లో కూడా కనిపించలేదు. దీంతో ఆఫీస్‌లో ఉన్న ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. ఆఫీస్‌ నుంచి వచ్చిన భర్త, బంధువులు ఇల్లంతా గాలించారు. చివరకు సోఫా బెడ్‌ లోపల సుప్రియా మృతదేహాన్ని ( Woman's Dead Body Found In Sofa Bed) గుర్తించారు. కాగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆ మహిళ గొంతు నులిమి, తలను బాది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

పెళ్లి వేడుకల్లో విషాదం, బావిలో పడి 13 మంది మృతి, బావిపై నిల్చొని వేడుక చూస్తుండగా ఘటన, మృతులంతా మహిళలే, వారిలో 9 మంది బాలికలు

మంగళవారం మధ్యాహ్నం 12.30 తర్వాత ఈ ఘటన జరిగినట్లు అంచనా వేశారు. పోస్ట్‌మార్టం కోసం మహిళ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమెను ఎందుకు చంపేశారనే దానిపై ఇంకా ఎటువంటి ఆధారాలు లభించలేదు.



సంబంధిత వార్తలు

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి