Luknow, Feb 17: ఉత్తరప్రదేశ్‌లో( Uttar Pradesh) ఘోర ప్రమాదం జరిగింది. వివాహ వేడుకలో భాగంగా జరిగే హల్దీ వేడుకలో(haldi ceremony) అపశృతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు 13 మంది మహిళలు బావిలో పడి మృతి చెందారు. వీరిలో 9 మంది బాలికలు ఉన్నారు. ఖుషీనగర్ (Kushinagar) జిల్లా నెబువా నౌరంజియాలో (Nebua Naurangia) వివాహ వేడుకలో భాగంగా హల్దీ ఫంక్షన్ జరుగుతోంది.
ఈ క్రమంలో కొంతమంది మహిళలు, యువతులు బావి పైకప్పుపై నిల్చున్నారు.బరువు అధికమవ్వడంతో పైకప్పు ఒక్కసారిగా ప్పకూలిపోయింది. దీంతో అందరూ బావిలో పడిపోయారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. మరో 15 మందిని గ్రామస్తులు రక్షించారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.
UP | 11 people died & two are seriously injured after they accidentally fell into a well. During a wedding program, some people were sitting on a slab of a well and due to heavy load the slab broke. An ex-gratia of Rs 4 lakh will be given to the kin of the deceased: DM Kushinagar pic.twitter.com/6PHeVYATp0
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 16, 2022
ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా (ex-gratia ) ప్రకటించారు.
ఖుషీనగర్‌లో జరిగిన ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటనను హృదయ విదారకంగా అభివర్ణించారు. మరణించిన కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.