Bitcoin Scam in Twitter: రెండు గంటలు..రూ.90లక్షలకు పైగా సంపాదన, సంపన్నుల ట్విట్టర్ అకౌంట్లే లక్ష్యంగా రెచ్చిపోయిన బిట్ కాయిన్ హ్యాకర్లు, చరిత్రలో చీకటి రోజని తెలిపిన ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే
అమెరికాలో రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ మొఘల్స్, సంపన్నుల అకౌంట్లే లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోయారు. ధనవంతుల అకౌంట్లను హ్యాక్ (US Twitter accounts) చేసి భారీ మొత్తంలో హ్యాకర్లు సంపాదనను పోగేసుకున్నారు. హ్యాక్ అయిన అకౌంట్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (US Former president Barack Obama), డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ (Joe Biden), టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మీడియా మొఘల్ మైక్ బ్లూమ్‌బర్గ్ (Mike Bloomberg), అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ (Amazon CEO Jeff Bezos), మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో (Bill Gates) పాటు యాపిల్, ఉబర్ వంటి సంస్థల అకౌంట్లు ఉన్నాయి. నిన్న మూడు నాలుగు గంటల పాటు వారి అధికారిక ఖాతాలలో హఠాత్తుగాక్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.
Washington, July 16: నిన్నంతా ట్విట్టర్ హ్యాకింగ్ తో (Twitter Accounts Hack) వణికిపోయింది. అమెరికాలో రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ మొఘల్స్, సంపన్నుల అకౌంట్లే లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోయారు. ధనవంతుల అకౌంట్లను హ్యాక్ (US Twitter accounts) చేసి భారీ మొత్తంలో హ్యాకర్లు సంపాదనను పోగేసుకున్నారు. ప్రపంచ ఆరవ కుబేరుడు ముకేష్ అంబానీ, కొత్త వినియోగదారులతో దూసుకుపోతున్న రిలయన్స్ జియో, బ్లూజీన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన ఎయిర్‌టెల్
హ్యాక్ అయిన అకౌంట్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (US Former president Barack Obama), డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ (Joe Biden), టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మీడియా మొఘల్ మైక్ బ్లూమ్‌బర్గ్ (Mike Bloomberg), అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ (Amazon CEO Jeff Bezos), మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో (Bill Gates) పాటు యాపిల్, ఉబర్ వంటి సంస్థల అకౌంట్లు ఉన్నాయి. నిన్న మూడు నాలుగు గంటల పాటు వారి అధికారిక ఖాతాలలో హఠాత్తుగాక్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.
నిన్న మూడు నుంచి నాలుగు గంటల పాటు బిట్‌కాయిన్ సైబర్ నేరగాళ్లు చేసిన హ్యాకింగ్‌తో (Bitcoin Scam in Twitter) ట్విట్టర్ వణికిపోయింది. హ్యాకర్లు సంపన్నుల ట్విట్టర్అ అకౌంట్లను హ్యాక్ చేసి అందులో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు పెట్టారు. వచ్చే 30 నిమిషాల్లో నాకు వెయ్యి డాలర్లు పంపండి. నేను తిరిగి 2 వేల డాలర్లు పంపుతాను’’అంటూ బిట్‌కాయిన్ లింక్ అడ్రస్ ఇస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. ఈ హ్యాకింగ్ ట్వీట్ల ద్వారా బిట్‌కాయిన్ వాలెట్‌లోకి లక్షా12 వేలకు పైగా డాలర్లు వచ్చి చేరాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకసారి గుర్తు తెలియని వాలెట్లలోకి వెళ్లిన మొత్తాన్ని తిరిగి రాబట్టడం అసాధ్యమని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
హ్యాక్ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ట్విట్టర్ యంత్రాంగం పోస్టులన్నింటినీ తొలగించి తాత్కాలికంగా ఆ ఖాతాలను నిలిపివేసింది. భద్రతా పరమైన అంశాలను పరీక్షించి అకౌంట్లను పునరుద్ధరించింది. బిట్‌కాయిన్ సొమ్ముల్ని రెట్టింపు చేసుకోండంటూ గతంలోనూ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి కానీ, ఇలా పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల ఖాతాలు హ్యాక్ కావడం ఇదే మొదటిసారని నిపుణులు అంటున్నారు.
మా సంస్థకు ఇవాళ గడ్డుదినం. ఈ దాడి అత్యం త భయానకమైనది. ఏం జరిగిందో విచారించి ట్విట్టర్‌లో భద్రతాపరమైన లోపాలను పరిష్కరిస్తాం’’అని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే (Twitter CEO Jack Dorsey ) ట్వీట్ చేశారు. హ్యాకింగ్ ఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే పేర్కొన్నారు. నష్టాన్ని నివారించే పనిలో ఉన్నామని, హ్యాకింగ్‌కు పాల్పడింది ఎవరనే దానిపై ఆరా తీస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ట్వీట్ చేశారు.
Here's Twitter CEO Jack Dorsey Tweet
దీనిని సమన్వయ సామాజిక ఇంజనీరింగ్ దాడిగా ట్విట్టర్ సపోర్ట్ టీమ్ అభివర్ణించింది. ట్విట్టర్‌లో అంతర్గతంగా ఉండే వ్యవస్థలు, టూల్స్ సాయంతో హ్యాకర్లు ట్విట్టర్ ఉద్యోగుల అడ్మినిస్ట్రేషన్ ప్రివిలేజెస్ సంపాదించారు. దాని ద్వారా ప్రముఖుల పాస్‌వర్డ్‌లు తెలుసుకొని మెసేజ్‌లు పోస్టు చేశారని ట్విట్టర్ సపోర్ట్ టీమ్ తెలిపింది. వీలైనంత త్వరగా డబ్బులు సంపాదించడమే వారి లక్ష్యమని ఇలాంటి స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Here's Twitter Support Tweet
సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్‌పెర్స్కీ ప్రకారం.. బిట్ కాయన్స్ హ్యాకర్స్ కేవలం రెండు గంటల్లో ట్విట్టర్ హోల్డర్ల అకౌంట్లనుంచి రూ. 90లక్షలు పైగా సొమ్మును కాజేసినట్లు వార్తలు వస్తున్నాయి. ట్వీట్టర్ అకౌంట్స్ ను హ్యాండిల్స్ చేస్తున్న సుమారు 367మంది నెటిజన్లకు చెందిన బ్యాంక్ అకౌంట్ లలో పెద్ద మొత్తంలో డబ్బు మాయమైందని తెలుస్తోంది. బ్లూ టిక్ ఉన్న అకౌంట్ల నుంచి ఈ ట్వీట్‌లు రావడంతో నిజమేననుకొని వారి అభిమానులు కొందరు భారీ మొత్తంలో హ్యాకర్లకు డబ్బులు కూడా పంపించినట్టు తెలుస్తోంది. హ్యాకర్లు పేర్కొన్న కొన్ని గంటల్లోనే హ్యాకర్ల ఖాతాలోకి 1.12 లక్షల అమెరికన్ డాలర్లు జమ కావడం షాక్ కలిగించే అంశంగా చెప్పవచ్చు.
తొలుత టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఖాతాలో బిట్ కాయిన్ స్కామ్‌కు పాల్పడేందుకు హ్యాకర్లు చేసిన ట్వీట్లు కనపడ్డాయి. ఆ తర్వాత వెంటనే బిల్‌గేట్స్ ఖాతాలోనూ ఇటువంటి ట్వీట్లే కనిపించాయి. ‘ఈ ట్వీట్‌ను బిల్‌గేట్స్ చేయలేదు. ట్విట్టర్‌లో తలెత్తిన లోపం కారణంగా ఈ ట్వీట్లు కనపడినట్లు తెలుస్తోంది’ అని బిల్‌గేట్స్ ప్రతినిధి రికోడ్స్ టెడ్డీ తెలిపారు.