Tigers Death: ఆవును చంపిందని రెండు పులులకు విషం పెట్టిన రైతు, విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడి
ఓ రైతును అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత అడవిలోని నీటికుంట వద్ద మూడేళ్లు, ఎనిమిదేళ్ల వయసున్న రెండు పులుల (Two Tigers dead) మృతదేహాలు కాస్త ఎడంగా పడుండటం గుర్తించి.. విచారణ చేపట్టారు. పులుల మృత కళేబరాలకు సమీపంలోనే మరో ఆవు చచ్చి పడుంది.
Chennai, SEP 13: తమిళనాడులోని నీలగిరి జిల్లాలో (Nilagir) రెండు పులుల అనుమానాస్పద మృతి ఘటనలో.. ఓ రైతును అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత అడవిలోని నీటికుంట వద్ద మూడేళ్లు, ఎనిమిదేళ్ల వయసున్న రెండు పులుల (Two Tigers dead) మృతదేహాలు కాస్త ఎడంగా పడుండటం గుర్తించి.. విచారణ చేపట్టారు. పులుల మృత కళేబరాలకు సమీపంలోనే మరో ఆవు చచ్చి పడుంది. మూడు కళేబరాల నమూనాలను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం కోయంబత్తూరుకు పంపారు. ఆ మృత కళేబరాల్లో పురుగుమందుల అవశేషాలు ఉన్నట్టు నివేదిక వచ్చింది. విషపూరితమైన ఆవు మృత కళేబరాన్ని తినడం వల్లే పులులు (Tigers) చనిపోయినట్టు తేలింది.
ఆవు యజమాని శేఖర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం తెలిసింది. పది రోజుల కిందట తన ఆవును పులి చంపినట్లు శేఖర్ తెలిపాడు. పులిపై ప్రతీకారం తీర్చుకోవాలని.. సగం తిని వదిలిన ఆవు మృత కళేబరానికి పురుగుమందులు పూసి తానే విషపూరితం చేసినట్టు అంగీకరించాడు