Representational image (Photo Credit- ANI)

Tiruvanthapuram, SEP 13: కేరళ (Kerala) రాష్ట్రంలో ప్రబలుతున్న నిపా వైరస్ (Nipah Virus) కలవరం సృష్టిస్తోంది. నిపా వైరస్ వల్ల ఇద్దరు మరణించగా, మరో నలుగురికి ఈ వైరస్ (Virus) సోకడంతో కేరళ ప్రభుత్వంతో పాటు కేంద్రం అప్రమత్తమయ్యాయి. ప్రాణాంతకంగా మారిన నిపా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కేరళ రాష్ట్రానికి కేంద్ర వైద్యనిపుణుల బృందం వచ్చింది. కోజికోడ్ నగరంలో ఈ వైరస్ ప్రభావంతో 12 ఏళ్ల బాలుడు మరణించడంతో ఆరోగ్య కార్యకర్తలు పరిసర ప్రాంతాల్లోని మేకల నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్ కు పంపించారు. పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పరీక్ష కోసం పంపిన ఐదు నమూనాల్లో మూడు పాజిటివ్‌గా వచ్చాయని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

మెదడుకు హాని కలిగించే ప్రాణాంతక వైరస్ సోకిన గబ్బిలాలు, పందులు,ఇతర వ్యక్తుల శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. నిపా వైరస్ పాజిటివ్ (Nipah Virus Cases) అని తేలిన మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడానికి నిపుణుల బృందాన్ని కేరళకు పంపినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. నిపా వైరస్ వ్యాప్తిని పరిష్కరించడానికి కేరళ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని జార్జ్ చెప్పారు.

Rajasthan Accident: హైవేపై ఆగిపోయిన బస్సు, రిపేర్‌ చేస్తుండగా వెనుక నుంచి ఢీకొట్టిన ట్రక్కు, రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం, 11 మంది మృతి 

కోజికోడ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం నాటికి 160 మందికి పైగా హైరిస్క్ వ్యక్తుల కాంటాక్ట్ లిస్ట్‌ను వైద్యాధికారులు రూపొందించారు. వారిని వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ వైరస్ వల్ల మరణించిన బాలుడి కుటుంబం పరిసరప్రాంతాల్లోని ఇళ్లలో ఫీవర్ సర్వే నిర్వహించారు. సకాలంలో నిపా వైరస్ ను గుర్తించడం వల్ల దాన్ని నివారించవచ్చని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సీనియర్ అధికారి చెప్పారు. కేంద్ర నిపుణుల బృందం కేరళలో పర్యటిస్తూ నిపా వైరస్ వ్యాప్తి గురించి ఆరా తీస్తోంది.