IndiGo Flight: స్నేహితుల మొబైల్ ఛాటింగ్ వల్ల ఆరు గంటల పాటు నిలిచిపోయిన విమానం, 185 మంది ప్రయాణికులను ముంబై వెళ్లే విమానంలోకి తిరిగి అనుమతించిన పోలీసులు
మంగళూరు నుంచి ముంబైకి వెళ్లాల్సిన విమానంలో (Mangaluru-Mumbai IndiGo Flight) ఓ వ్యక్తి మొబైల్‌కి సందేశం రావడంతో ఆ విమానం ఆగిపోయింది
Mangaluru, August 15: ఇద్దరు స్నేహితుల మధ్య ఛాటింగ్ వల్ల విమానం ఆరుగంటలు ఆలస్యంగా బయలుదేరింది. మంగళూరు నుంచి ముంబైకి వెళ్లాల్సిన విమానంలో (Mangaluru-Mumbai IndiGo Flight) ఓ వ్యక్తి మొబైల్‌కి సందేశం రావడంతో ఆ విమానం ఆగిపోయింది. ఆసక్తికర ఘటన వివరాల్లోకెళితే.. ఆదివారం సాయంత్రం ఇండిగో విమానాన్ని ముంబై బయలుదేరడానికి అనుమతించే ముందు పోలీసులు ప్రయాణికులందర్నీ విమానం (Delayed By 6 Hours Over Mobile Chat) నుంచి దించి హఠాత్తుగా తనీఖీలు చేయడం మొదలు పెట్టారు.
దీనికి ప్రధాన కారణం అందులో ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలు. ఆమె తన సహా ప్రయాణికుడి మొబైల్‌కి అనుమానాస్పద సందేశం రావడంతో ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. దీంతో సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ని అప్రమత్తం చేయడంతో టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న విమానం కాస్త ఆగిపోయింది. తిరిగి ఎయిర్ పోర్టు బేకు చేరుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి తన మొబైల్‌లో ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడు.
ఈ పక్షికి నిలువెల్లా విషమే.. అవును.. ప్రపంచంలోనే మొట్టమొదటి విషపూరిత పక్షి ఇది.
అదే విమానాశ్రయం నుంచి బెంగళూరుకు విమానం ఎక్కేందుకు వచ్చిన తనప్రియురాలితో మొబైల్‌లో చాటింగ్ చేస్తున్నాడు. తన స్నేహితురాలు కర్ణాటక రాజధానికి వెళ్లే విమానం మిస్సైందని చెప్పుకొచ్చాడు. ఐతే పోలీసులు అతన్ని చాలా సేపు విచారించిన తర్వాత గానీ ప్రయాణించేందుకు అనుమతించ లేదు. ఈ మేరకు ప్రయాణికులందర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత దాదాపు 185 మంది ప్రయాణికులను ముంబై వెళ్లే విమానంలోకి తిరిగి అనుమతించారు. దీంతో విమానం సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరింది. ఐతే ఇది భద్రతల నడుమ ఇద్దరి వ్యక్తుల మధ్య స్నేహ పూర్వక సంభాషణే కావడంతో ఆ వ్యక్తి పై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని నగర పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ అన్నారు.