New Delhi, August 15: ఫోటో చూడగానే పక్షి ఎంత ముద్దొస్తుందో అనుకుంటున్నారు కదూ.. ఆగండాగండి.. హుడెడ్ పిటోహుయ్ (Hooded Pitohui) అనే ఈ పక్షికి నిలువెల్లా విషం (Poison) ఉంటుంది. పపువా న్యూగినియాలో ఎక్కువగా కనిపించే ఈ చిన్న పిట్ట ప్రపంచంలోకెల్లా శాస్త్రీయంగా నిర్ధారణ అయిన మొట్టమొదటి విషపూరిత పక్షి (Poisonous Bird) అట.
హుడెడ్ పిటోహుయ్ పక్షి ఈకలు, చర్మం, అంతర్గత అవయవాలు, చివరకు ఎముకల్లోనూ విషం దాగి ఉంటుందట! దీని విషం శరీరంలోకి ప్రవేశిస్తే ఏకంగా గుండెపోటు, మరణం సంభవిస్తాయట!! అందుకే వేటగాళ్లు సైతం దీన్ని వేటాడేందుకు వెనకాడతారట! జాగ్రత్త మరి..