NewDelhi, August 14: మధుర(madhura)కు చెందిన తుంగనాథ్ చతుర్వేది అనే న్యాయవాది 1999 డిసెంబర్‌లో మొరాదాబాద్‌కు రెండు టిక్కెట్లను కొనుగోలు చేశారు. అప్పుడు ఆ టిక్కెట్ ధర రూ.70 కాగా టిక్కెట్ గుమస్తా అతని దగ్గర నుంచి రూ.90లు వసూలు చేశాడు. ఈ ఘటన డిసెంబర్ 25, 1999న చోటు చేసుకుంది. చతుర్వేది అతనిని ప్రశ్నించడమే కాకుండా ఈ విషయమై స్టేషన్ మాస్టర్‌ని కూడా కలిశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.
దీంతో ఆయన న్యాయం కోసం భారత రైల్వే (Indian Railway)కి వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కారు. ఈ కేసు విషయమై సుమారు 22 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఎట్టకేలకు కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడమే కాకుండా తక్షణమే రైల్వే శాఖ రూ.15,000 చెల్లించాలని (వడ్డీతో కలిపి) ఆదేశించింది. ఈ పోరాటంలో చాలా కష్టాలు అనుభవించానని చతుర్వేది చెప్పారు. రూ. 20 కోసం తాను ఈ పోరాటం చేయలేదని, న్యాయం (Justice) కోసమే ఇదంతా చేశానని తెలిపాడు.