Manipur Violence: సీఎం పర్యటన వేళ రెచ్చిపోయిన అల్లరిమూక, సభా వేదికకు నిప్పు, మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు, ఇంటర్నెట్ బంద్, 144 సెక్షన్‌ అమల్లోకి..

అల్లరి మూక రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ (N Biren Singh) శుక్రవారంనాడు పర్యటించాల్సి ఉన్న చురాచాంద్‌పూర్ (Churachandpur) జిల్లాలోని సభా వేదికను ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు.

Mob set fire to an open gym constructed at PT Sports Complex in New Lamka. (Photo Credit: ANI)

Imphal, April 28: మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌ జిల్లా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అల్లరి మూక రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ (N Biren Singh) శుక్రవారంనాడు పర్యటించాల్సి ఉన్న చురాచాంద్‌పూర్ (Churachandpur) జిల్లాలోని సభా వేదికను ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. దీంతో స్థానిక యంత్రాంగం చురాచాంద్‌పూర్‌లో ఇంటర్నెట్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. జిల్లాలో 144 సెక్షన్‌ను పోలీసులు అమల్లోకి తెచ్చారు.

గురువారం రిజర్వ్‌ చేసిన రక్షిత అడవులు, చిత్తడి నేలలు, వంటి ప్రాంతాలపై బీజేపీ ప్రభుత్వం చేసిన సర్వేని ఆదివాసి గిజన నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి షెడ్యూల్‌ కార్యక్రమానికి చెందిన వేదికను ఓ గుంపు ధ్వంసం చేసి, నిప్పంటించారు. అల్లరిమూక సభాస్థలిలోని చైర్లు విరగ్గొట్టి, ఇతర ఆస్తులను ధ్వంసం చేసింది. క్రీడాసామగ్రికి నిప్పుపెట్టింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అల్లరిమూకను చెదరగొట్టినప్పటికీ, జిమ్‌లోని కొంతభాగం అప్పటికే ధ్వంసమైంది.

మీ ధర్నా వల్ల భారత్ పరువు పోతుందని తెలిపిన పీటీ ఉష, గతంలో వేధిస్తున్నారంటూ అందరి ముందు ఎందుకు ఏడ్చావని ప్రశ్నిస్తున్న భారత రెజ్లర్లు

వందకు పైగా కుర్చీలు అగ్నికి ఆహుతయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో జిల్లా యంత్రాంగం అదనపు భద్రతా బలగాలను రప్పించింది. పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది. రిజర్వెడ్ ఫారెస్ట్ ల్యాండ్‌ను బీజేపీ ప్రభుత్వం సర్వే చేయించడాన్ని విభేదిస్తున్న స్థానిక గిరిజన నేతల ఫోరం సారథ్యంలో కొందరు ఈ హింసాకాండకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్చిలను కూడా కూల్చివేసినట్టు గిరిజన ఫోరం ఆరోపిస్తోంది.

ఉద్రిక్తతలు మరింతగా చెలరేగేలా..ప్రజలు ఎవరితోనూ కమ్యూనికేట్‌ చేయకుండా ఉండేందుకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. ప్రజల ప్రాణలు, ఆస్తులకు తీవ్ర ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తాము శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండేలా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చురాచంద్‌పూర్ జిల్లా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ థియెన్‌లట్‌జోయ్ గాంగ్టే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నేను చావును కోరుకుంటున్నాను, రెజ్లర్ల నిరసన లైంగిక వేధింపుల ఆరోపణలపై వీడియో విడుదల చేసిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్

ఇదిలా ఉండగా, రైతులు, ఇతర గిరిజన నిర్వాసితులు రిజర్వు అటవీ ప్రాంతాలను తొలగించడం కోసం కొనసాగుతున్న డ్రైవ్‌ను నిరసిస్తూ ప్రభుత్వానికి పదేపదే మెమోరాండంలు సమర్పించారు. అయినప్పటికీ తమ కష్టాలను పరిష్కరించడంలో ప్రభుత్వం సుముఖత లేదా చిత్తశుద్ధి చూపలేదని గిరిజన నాయకుల ఫోరం పేర్కొంది. ఈమేరకు కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా ఫోరమ్‌కు మద్దతుగా నిలిచింది.

ఆదివాసులపై ప్రభుత్వం సవతి తల్లి మాదిరిగా ప్రవర్తిస్తుందని కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆరోపించింది. మత కేంద్రాలను కూల్చివేయడం, గిరిజన గ్రామాలను అక్రమంగా తొలగించడం వంటి వాటితో గిరిజన హక్కులను నిర్వీర్యం చేస్తుందని, దీన్ని తాము ఖండిస్తున్నట్లు ఆర్గనైజేషన్‌ పేర్కొంది. కాగా, మణిపూర్‌లోని మూడు చర్చిలను ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో కూల్చివేసి, వాటిని అక్రమ నిర్మాణాలుగా పేర్కొనడం గమనార్హం.