Mukesh Ambani Security Scare: ముఖేష్ అంబానీ ఇంటివద్ద కలకలం, కీలక మలుపు తిరిగిన కేసు, మన్సుఖ్ హిరెన్ అనుమానాస్పద మరణంపై మహారాష్ట్ర ఏటీఎస్ ఎఫ్ఐఆర్ నమోదు, ఎన్‌ఐఏ దర్యాప్తును డిమాండ్ చేస్తున్న ఫడ్నవిస్
హిరేన్ భార్య విమల ఫిర్యాదు మేరకు మరణించిన రెండు రోజుల తరువాత (Mansukh Hiren death), మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక విభాగం ఆదివారం హత్య కేసు (Maha ATS registers murder case)నమోదు చేసింది. అలాగే రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం హిరెన్ మరణానికి సంబంధించిన కేసును ఏటిఎస్‌కు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Mumbai, Mar 8: పారిశ్రామిక వేత్త అంబానీ నివాసం వద్ద ఫిబ్రవరి 26న పేలుడు పదార్థాల వాహనం కలకలం రేపిన సంగతి విదితమే. ఈ వ్యవహారంపై రోజు రొజుకు షాకింగ్ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా అంబానీ హౌస్ వద్ద ఉన్న స్కార్పియో వాహనం యజమాని మన్సుఖ్ హిరెన్ అనుమానాస్పద రీతిలో మరణించారు. ఈ కేసు (Mukesh Ambani Security Scare) ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. నేరపూరిత కుట్ర, హత్య, సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలపై మహారాష్ట్ర ఏటీఎస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
హిరేన్ భార్య విమల ఫిర్యాదు మేరకు మరణించిన రెండు రోజుల తరువాత (Mansukh Hiren death), మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక విభాగం ఆదివారం హత్య కేసు (Maha ATS registers murder case)నమోదు చేసింది. అలాగే రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం హిరెన్ మరణానికి సంబంధించిన కేసును ఏటిఎస్‌కు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో సంబంధిత పత్రాలన్నీ ఏటీఎస్ విభాగం స్వాధీనం చేసుకుని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి విచారిస్తున్నారు. ఈ కేసులో హిరేన్ ఒక్కడే సాక్షి అతడిని కూడా కోల్పోయామని అని దర్యాప్తు అధికారి వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.
దీనిపై పలు అనుమానాలను వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్‌ఐఏ దర్యాప్తును డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్' మహారాష్ట్ర పోలీసు అధికారి సచిన్ వాజ్ పాత్రపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. మరోవైపు మన్సుఖ్‌ను తనను కలిసారాన్న ఆరోపణలను సచిన్ వాజ్ ఖండించారు. మన్సుఖ్ థానేకు చెందినవాడు కాబట్టి తనకు తెలుసు అంతేకానీ, ఇటీవలి కాలంలో అతడిని కలవలేదన్నారు.
అలాగే తనను వేధిస్తున్నట్టుగా మన్సుఖ్ ఫిర్యాదు చేశాడని ధృవీకరించారు. అలాగే ఈ కేసులో అంబానీ నివాసానికి చేరుకున్న మొదటి వ్యక్తిని తాను కాదని, సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ గామ్దేవి అని, ఈ తరువాత క్రైమ్ బ్రాంచ్ బృందంతో పాటు స్పాట్ చేరుకున్నానని వివరణ ఇచ్చారు. అలాగే క్రాఫోర్డ్ మార్కెట్‌లో మన్సుఖ్‌ను కలిశాననే ఆరోపణలు అబద్ధమని కొట్టి పారేశారు.
మరోవైపు పోలీసు అధికారులు తనను వేధిస్తున్నారని, ఈ వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సహా థానే, ముంబయి పోలీస్ కమిషనర్లకు హిరేన్ మార్చి 2న లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి 5న హిరేన్ అనుమానాస్పదంగా శవమై తేలడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే కుటుంబ సభ్యులు అందించిన సమాచారం వారం రోజుల క్రితమే తన వాహనం చోరీకి గురైందని మన్‌సుఖ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత కందివాలి యూనిట్ క్రైమ్ బ్రాంచ్ అధికారిని కలవడానికి తాను థానేలోని ఘోడ్‌బందర్ ప్రాంతానికి వెళుతున్నానని హిరెన్ తన కొడుకుతో చెప్పి ఆటో రిక్షాలో బయలుదేరాడనీ, మార్చి 4, గురువారం రాత్రి 10.30 నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.
శుక్రవారం ఉదయం వరకు హిరెన్ కనిపించకపోవడంతో, అతని కుటుంబ సభ్యులు నౌపాడా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గత వారం మధ్యాహ్నం థానేలోని కొలనులో నోటిలో గుడ్డలు గుక్కిన రీతిలో అతని మృతదేహాన్ని (Two days after vehicle owner found dead) పోలీసులు కనుగొన్నారు. అయితే తన సోదరుడు అత్మహత్య చేసుకునేంత పిరికవాడుకాదనీ, అతనికి ఈత కూడా బాగా వచ్చని హిరెన్ సోదరుడు వినోద్ మీడియాకు తెలిపారు. ఇది కచ్చితంగా హత్యే అని ఆయన వాదిస్తున్నారు. మరోవైపు తని శరీరంపై పలు గాయాలున్నాయని పలు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది.
అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపి ఉంచింది తామేనని 'జైష్ ఉల్ హింద్' సంస్థ ప్రకటించిందన్న వార్త ఫేక్‌న్యూస్ అంటూ జైష్-ఉల్-హింద్ చేసిన ప్రకటన చేసింది. టెలిగ్రామ్ యాప్‌లో మెసేజ్ ద్వారా తామే దీనికి బాధ్యత వహిస్తున్నట్లు వచ్చిన నివేదికలను ఖండించింది. ఈ మేరకు జైష్-ఉల్-హింద్ ఒక ప్రకటన విడుదల చేసిందని బిజినెస్ టుడే నివేదించింది.
టెలిగ్రామ్ ఖాతాలో, జైష్-ఉల్-హింద్ పేరిట విడుదల చేసిన పోస్టర్‌తో తమకు సంబంధంలేదని, తప్పుడు వార్తలని పేర్కొంది. 'జైష్-ఉల్-హింద్ నుండి అంబానీకి ముప్పు లేదు' అనే పేరుతో వెల్లడించిన వివరణలో ‘‘తమ పోరాటం బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోదీ ఫాసిజానికి వ్యతిరేకంగా మాత్రమే. హిందూ అమాయక ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. మా పోరాటం షరియా కోసం, డబ్బు కోసం కాదు. లౌకిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం గానీ అంబానీకి వ్యతిరేకంగా కాదు’’ అని తెలిపింది. అలాగే తాము అవిశ్వాసులనుంచి డబ్బులు తీసుకోమని, భారతీయ వ్యాపార దిగ్గజాలతో తమకెలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. మార్ఫింగ్ ఫోటోలతో భారత నిఘా సంస్థ నకిలీ పోస్టర్లు తయారు చేస్తోందంటూ మండిపడింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నివాసం 'ఆంటిలియా'దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనం నిలిపి ఉంచారు. ఈ వాహనంలో జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 20 జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు తేలిందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియోను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాని యజమాని ఎవరు? అందులో పేలుడు పదార్థాలు పెట్టిందెవరు? ఎందుకోసం పెట్టారు? అనేది తేల్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంబానీ ఇంటి వెలుపల భద్రత కట్టుదిట్టం చేశారు. సీసీటీవీఫుటేజీని పరిశీలిస్తున్నారని తెలిపారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)