
Agra, March 4: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆగ్రాలోని ప్రేమసౌధం, అందమైన కట్టడం తాజ్ మహల్‌కు గురువారం బాంబు బెదిరింపు కాల్ (Bomb Scare at Taj Mahal) వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు తాజ్ మహల్ రెండు ద్వారాలను మూసివేశారు. పర్యాటకులను అక్కడినుంచి ఖాళీ చేయించారు.
బాంబు బెదిరింపు నేపథ్యంలో తాజ్ మహల్‌లో సీఐఎస్‌ఎఫ్, స్థానిక బలగాలను మోహరించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఐఎస్‌ఎఫ్, స్థానిక బలగాలను మోహరించారు. బాంబు బెదింపు కాల్ (Taj Mahal Bomb Scare) రావడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
కాగా యూపీ పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 112కి ఫోన్ కాల్ చేసిన దుండగులు..తాజ్ మహల్‌లో పేలుడు పదార్దాలు పెట్టామని, ఏ క్షణమైనా అవి పేలొచ్చని తెలిపాడు. దీంతో వెంటనే దీంతో అలర్ట్ అయిన పోలీసులు సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది తాజ్ మహల్ కట్టడం పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. అయితే తాజ్‌మహల్ లోపల ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదని ఆగ్రా జోన్ ఏడీజీ రాజీవ్ కృష్ణ ధృవీకరించారు. ఇది ఫేక్ కాల్ అని పేర్కొన్నారు.