HC on Harassment: కోడలిని అత్తింటివారు ఎగతాళి చేసినంత మాత్రాన దాన్ని వేధింపులుగా పరిగణించలేం, మహిళ ఆత్మహత్య కేసులో భర్త,మరిది,అత్తను నిర్దోషులుగా ప్రకటించిన బాంబే హైకోర్టు

అత్తింటివాళ్లు గేలి చేసినంతమాత్రాన దాన్ని మానసికంగా వేధించడం గానో, మానసిక క్రౌర్యంగానో పరిగణించలేమని (Mere taunting by in-laws not harassment) బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ ధర్మాసనం (Bombay High Court ) మంగళవారం తీర్పు చెప్పింది.

Bombay HC (photo credit- ANI)

Mumbai, Jan 24: అత్తింటివాళ్లు గేలి చేసినంతమాత్రాన దాన్ని మానసికంగా వేధించడం గానో, మానసిక క్రౌర్యంగానో పరిగణించలేమని (Mere taunting by in-laws not harassment) బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ ధర్మాసనం (Bombay High Court ) మంగళవారం తీర్పు చెప్పింది. ఈ కేసులో ఒక మహిళను ఆటపట్టించి ఆత్మహత్యకు పురిగొల్పారనే ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు వ్యక్తులను నిర్దోషులగా ప్రకటించింది. వారు మృతురాలి భర్త, మరిది, అత్త కావడం గమనార్హం.

మృతి చెందిన మహిళ గర్భస్రావంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, తల్లి కడుపులో బిడ్డ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తరువాత గర్భస్రావం చేస్తే ఎటువంటి కేసు లేదని తెలిపిన ధర్మాసనం

1993లో పెళ్లయినప్పటి నుంచి ఆమెకు వంట పని, ఇంటి పని రాదని ఈ ముగ్గురూ వేధించడం వల్లనే 1994 ఏప్రిల్‌లో ఆమె నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారని ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. అత్తింటి వారు రూ.10,000 కట్నం కావాలని ఒత్తిడి చేశారని కూడా ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. అయితే మృతురాలిని వారే చంపినట్లు, ఆత్మహత్యకు పురిగొల్పినట్లు సాక్ష్యాధారాలు లేవని, కేవలం ఆటపట్టించినంత మాత్రాన మానసిక క్రౌర్యంగా పరిగణించలేమని ఔరంగాబాద్‌ ధర్మాసనం తీర్పు చెప్పింది.