Parliament Winter Session: పార్లమెంటు భవనంలో అగ్ని ప్రమాదం, రాజ్యసభ సమావేశాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా, లోక్‌సభలో ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు
సమాచారం ప్రకారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పార్లమెంటులోని 59వ గదిలో మంటలు (Minor fire in a room of Parliament House)చెలరేగాయి. అధికారులు తక్షణమే స్పందించడంతో కొద్దిసేపటికే అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేయగలిగాయి.
New Delhi, Dec 1: పార్లమెంట్ భవనంలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పార్లమెంటులోని 59వ గదిలో మంటలు (Minor fire in a room of Parliament House)చెలరేగాయి. అధికారులు తక్షణమే స్పందించడంతో కొద్దిసేపటికే అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేయగలిగాయి. ఈ ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉందని, ఈ ఘటననై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో (Parliament Winter Session) భాగంగా 3 రోజు సభ ప్రారంభమైంది. మొదటి రోజు నుంచి రాజ్యసభలో సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక 3 రోజైన బుధవారం 12 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలనే అంశం సభను రసాభసగా మార్చింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ సమావేశాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి 12 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్న అంశాన్ని మరో సారి మల్లిఖార్జున ఖర్గే లేవనెత్తడంతో సభ రసాభసగా మారింది. దీంతో సభ సజావుగా సాగని పరిస్థతి ఏర్పడేసరికి మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
లోక్‌సభలో ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా మర్యాదలు పాటించాలని హితవు పలికారు. సభ్యులు మాట్లాడుతుంటే నినాదాలు చేయడం సరికాదని, సభ ప్రజల గొంతు వినిపించడం కోసం ఉందని సూచించారు. సభ వెల్‌లోకి విపక్ష ఎంపీలు వెళ్లడంతో సభ గందరగోళంగా మారింది. దీంతో పాటు ధాన్యం కొనుగోళ్ల అంశం పై కేంద్రం స్పష్టత ఇవ్వాలంటూ టిఆర్ఎస్ రాజ్య సభ ఎంపీలు కూడా వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు.