Monsoon 2023: తెలుగు రాష్ట్రాల్లోకి కాస్త ఆలస్యంగా ప్రవేశించనున్న రుతుపవనాలు, వారం తర్వాతే అంతటా వర్షాలు ఉంటాయని తెలిపిన ఐఎండీ

వారం తర్వాతే అంతటా వర్షాలు ఉంటాయని పేర్కొంది.

Credits: Wikimedia commons

నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది.రుతుపవనాల రాక ప్రభావంతో.. రానున్న 48 గంటల్లో కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలుపడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వారం తర్వాతే అంతటా వర్షాలు ఉంటాయని పేర్కొంది.

ఎండలకు బైబై, కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, ఇకపై విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

ఈ ఏడాది దోబూచులాడిన రుతుపవనాలు.. కాస్త ఆలస్యంగా ప్రవేశించాయి. సాధారణంగా జూన్‌ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేస్తుంటాయి. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పడమట గాలులు కొనసాగుతున్నాయి. అంతకు ముందు పశ్చిమ గాలుల లోతులో పెరుగుదల, ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళ తీర ప్రాంతాలపై మేఘావృతం ఉధృతం కావడం వంటి పరిణామాలు కనిపించాయి.

తీవ్ర తుపానుగా మారిన సైక్లోన్ బిపాజోయ్, ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను ఇది, దీని ప్రభావం ఎంతంటే..

తెలంగాణలో మూడురోజులపాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది వాతావరణశాఖ. అయితే.. గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీకి ఉపశమనం కాస్త ఆలస్యం కావొచ్చని అంచనా వేస్తోంది.