IPL Auction 2025 Live

MUDA Land Scam: ముడా కుంభకోణంలో క‌ర్నాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌కు షాక్, విచారణకు కర్ణాటక హైకోర్టు ఆమోదం, చట్ట ప్రకారం విచారించవచ్చని తీర్పు

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah)కు కర్ణాటక హైకోర్టు రిలీఫ్ ఇవ్వలేదు.ఈ కేసులో విచార‌ణ‌నను నిలిపివేయాల‌ని ఆయ‌న వేసిన పిటీష‌న్‌ను హైకోర్టు కొట్టిపారేసింది.

Siddaramaiah (photo-X)

Bengaluru, Sep 24: మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah)కు కర్ణాటక హైకోర్టు రిలీఫ్ ఇవ్వలేదు.ఈ కేసులో విచార‌ణ‌నను నిలిపివేయాల‌ని ఆయ‌న వేసిన పిటీష‌న్‌ను హైకోర్టు కొట్టిపారేసింది. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు కర్ణాటక హైకోర్టు ఆమోదం తెలిపింది. పిటిషన్‌లో పేర్కొన్న వాస్తవాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.

సెప్టెంబర్ 12న కేసు విచారణను పూర్తి చేసిన తర్వాత హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (muda) కేసులో తనపై దర్యాప్తునకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఇచ్చిన ఆమోదాన్ని సిద్ధరామయ్య ఈ పిటిషన్‌లో సవాలు చేశారు.

మంగళవారం మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కేసుపై తీర్పును వెలువరిస్తూ గవర్నర్ ఈ కేసును చట్ట ప్రకారం విచారించవచ్చని హైకోర్టు తెలిపింది. జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ గవర్నర్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించింది.

మిమ్మల్ని లోపలకు అనుమతించని దేవాలయాలకు వెళ్లడం మానేయండి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

గవర్నర్ ఉత్తర్వు మేరకు ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలన్నారు. గవర్నర్ చర్యలో ఎలాంటి లోపం లేదన్నారు. అంతకుముందు సిద్ధరామయ్య తరపున సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సహా పలువురు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. దీంతో పాటు ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాదులు స్నేహమయి కృష్ణ, టీజే అబ్రహం కూడా తమ వాదనలు వినిపించారు.

మైసూరు అర్బ‌న్ డెవ‌ల‌ప్మెంట్ అథారిటీలో సుమారు 14 సైట్ల‌ను అక్ర‌మ రీతిలో సీఎం సిద్ద‌రామ‌య్య భార్య‌కు అప్ప‌గించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కేసులో సీఎం సిద్దును విచారించాల‌ని గ‌వ‌ర్న్ గెహ్లాట్ ఆదేశాలు ఇచ్చారు. అవినీతి నిరోధ‌క చ‌ట్టంలోని సెక్ష‌న్ 17ఏ ప్ర‌కారం, భార‌తీయ నాగ‌రిక సుర‌క్షా సంహిత‌లోని సెక్ష‌న్ 218 ప్ర‌కారం.. సీఎంను విచారించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు గ‌వ‌ర్న‌ర్ త‌న ఆదేశాల్లో తెలిపారు. సిద్ద‌రామ‌య్య త‌ర‌పున ప్ర‌ముఖ న్యాయ‌వాది అభిషేక్ మ‌నూ సింఘ్వీ, ప్రొఫ‌స‌ర్ ర‌వివ‌ర్మ కుమార్ వాదించారు. ఇక గ‌వ‌ర్న‌ర్ త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా, అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ శ‌శి కిర‌ణ్ షెట్టి త‌మ వాద‌న‌లు వినిపించారు.

కర్ణాటక హైకోర్టు ఆగస్టు 19న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో సిద్ధరామయ్యకు తాత్కాలిక ఉపశమనం కలిగించింది. దీంతో పాటు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తదుపరి విచారణను వాయిదా వేయాలని, గవర్నర్ ఇచ్చిన ఆమోదానికి అనుగుణంగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి కె. సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి "చర్చల" తర్వాత అనుమతి లభించిందని ఆగస్టు 31న కర్ణాటక గవర్నర్ కార్యాలయం హైకోర్టుకు తెలిపింది.

కానీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టులో కర్ణాటక ప్రభుత్వ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ‘రాజ్‌భవన్ చలో’ నిరసన చేపట్టారు. గవర్నర్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తూ, అనేక ఇతర కేసులు కూడా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

అయితే వాటిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇదిలా ఉండగా, ఆరోపించిన ముడా కుంభకోణంపై పత్రాలతో పాటు వివరణాత్మక నివేదికను అందించాలని గవర్నర్ గెహ్లాట్ గత వారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షాలినీ రజనీష్‌ను కోరారు.



సంబంధిత వార్తలు

Maharashtra Election Result 2024: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, 288 నియోజకవర్గాల వారీగా గెలిచిన అభ్యర్థుల జాబితా ఇదిగో

Jharkhand Election Result 2024: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నాలుగో సారి సీఎం కాబోతున్న హేమంత్‌ సొరేన్‌, 56 స్థానాల్లో జేఎంఎం కూటమి విజయభేరి, 26 స్థానాలతో సరిపెట్టుకున్న ఎన్డీఏ కూటమి

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ షురూ.. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే హవా.. కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే (లైవ్)

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ కు స‌ర్వం సిద్ధం, వ‌య‌నాడ్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి, కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే