Mumbai Shocker: పెళ్లి పేరుతో కామ వాంఛలు తీర్చుకున్న స్టార్ హీరోయిన్‌ బాడీగార్డు, ముంబై పోలీసులను ఆశ్రయించిన మహిళ, బాడీగార్డుపై ఐపీసీ సెక్షన్ 376, 377, 420ల కింద కేసు నమోదు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి బ్యూటీషియన్‌ను మోసం చేసిన కేసులో వివాదాస్పద స్టార్ హీరోయిన్ బాడీగార్డుపై ముంబై పోలీసులు కేసు నమోదు (Bodyguard of actress booked for 'raping' beautician) చేశారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Mumbai, May 22: బాలీవుడ్‌ హీరోయిన్‌ బాడీగార్డుపై ముంబై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బ్యూటీషియన్‌ను మోసం చేసిన కేసులో వివాదాస్పద స్టార్ హీరోయిన్ బాడీగార్డుపై ముంబై పోలీసులు కేసు నమోదు (Bodyguard of actress booked for 'raping' beautician) చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబై నగరానికి చెందిన 30ఏళ్ల మహిళ బ్యూటీషియన్‌గా (beautician) పనిచేస్తూ అథేరీ ప్రాంతంలో నివాసముంటోంది. ఈమెకు ఎనిమిదేళ్ల నుంచి బీటైన్‌కు చెందిన నటి వ్యక్తిగత బాడీగార్డ్‌ కుమార్‌ హె‍గ్డేకు పరిచయం ఉంది.

ఆ పరిచయంతో గతేడాది జూన్‌లో పెళ్లి చేసుకుంటానని బ్యూటీషియన్‌తో చెప్పి అప్పటి నుంచి ఆమె ఫ్లాట్‌లోనే ఇద్దరూ కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో మహిళతో అతను శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. తరువాత పెళ్లి చేసుకుందామని (pretext of marriage) బ్యూటీషియన్‌ అతన్ని ఎన్నిసార్లు అడిగిన ఆ విషయాన్ని దాటేస్తూ వచ్చాడు.

పెళ్లి చేసుకుంటానంటూ మహిళా డాక్టర్‌పై అదేపనిగా అత్యాచారం, తరువాత అశ్లీల ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరింపులు, నాగ్‌పూర్‌లో ఐటీ కమిషనర్‌ దారుణం, ఐపీసీ సెక్షన్‌ 376 (2) కింద నిందితుడిపై కేసు నమోదు

కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ 27న బాడీగార్డ్ కుటుంబ అవసరాల కోసం బ్యూటీషియన్ నుంచి రూ.50వేల నగదు తీసుకొని, అతని స్వస్థలమైన కర్ణాటకకు వెళ్లిపోయాడు. స్వస్థలానికి వెళ్లిన తరువాత అతను మాట్లాడటం మానేసి యువతిని దూరం పెట్డడం ప్రారంభించాడు.ఆ తరువాత కుమార్‌ తల్లి బ్యూటీషియన్‌కు ఫోన్ చేసి తమ కులాలు వేరని, తనతో పెళ్లి జరగదని చెప్పింది. అంతేగాక తన కొడుక్కి వేరే సంబంధం చూసినట్లు పేర్కొంది. అతన్ని మరచిపోవాలని బెదిరించింది.

వృద్ధురాలిని చంపేసి ఆపై శవంతో అత్యాచారం, ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, జువైనల్‌ కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపిన డీఎస్పీ ప్రసాద్‌

దీంతో కుమార్ తనను మోసం చేశాడని ఆ బ్యూటీషియన్‌ ముంబై పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిపై అత్యాచారం కేసు పెట్టింది. బ్యూటీషియన్ ఫిర్యాదు మేరకు బాడీగార్డుపై ఐపీసీ సెక్షన్ 376, 377, 420ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముంబై పోలీసులు పేర్కొన్నారు. కాగా కుమార్‌ హెగ్డే బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ వ్యక్తిగత బాడీగార్డ్‌గా ఉన్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది.