Cylinder Blast in Mumbai: ముంబైలో సిలిండర్ పేలుడు, 20 మందికి పైగా గాయాలు, లాల్ బాగ్ ఏరియాలో ఘటన, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన అధికారులు, మరోచోట టీవీ చూడనివ్వలేదని బాలుడు ఆత్మహత్య
లాల్‌బాగ్ ఏరియాలోగ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల మంటలు సంభవించినట్లుగా అనుమానిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Mumbai, December 6: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని లాల్‌బాగ్ ఏరియాలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Cylinder Blast in Mumbai) చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది. లాల్‌బాగ్ ఏరియాలోగ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల మంటలు సంభవించినట్లుగా అనుమానిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
కాగా ప్రమాదం జరిగిన స్థలంలో చెలరేగుతున్న మంటలను (Cylinder Blast) ఆర్పడానికి రెండు అగ్నిమాపక దళాలతో పాటు రెండు జంబో ట్యాంకర్లను పంపించినట్లు బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తెలిపింది. అగ్ని మాపక అధికారుల ప్రకారం.. లాల్ బాగ్ ప్రాంతంలోని ఓ బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయని, ఈ మంటలే సిలిండర్ పేలుడుకు దారి తీసిందని పేర్కొంటున్నారు. ఈ పేలుడులో గాయపడిన వారిని గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించామని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే టీవీ చూడనివ్వడం లేదనే కోపంతో 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘట ముంబైలోని న పింప్రి–చించ్‌వడ్‌లోని చిఖలీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, రంజాన్ అబ్దుల్ శస్త్రక్ (13) తరుచూ ఎక్కువగా టీవీ చూస్తుండటంతో వాళ్ల అమ్మ తిడుతూ ఉండేది.
దీంతో మనస్థాపానికి గురైన అబ్దుల్ మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బుధవారం రంజాన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం మరో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.