Covid in Mumbai: కరోనాను తరిమికొట్టిన దేశ ఆర్థిక రాజధాని, ముంబైలో తొలిసారిగా జీరో మరణాలు, గత 24 గంటల్లో కొత్తగా 367 కరోనా కేసులు, భారత్‌లో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు

గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా మరణం (Mumbai Reports Zero COVID-19 Death ) కూడా నమోదవ్వలేదు. మహమ్మారి విజృంభించినప్పటి నుంచి ఒక రోజులో మరణాలు రికార్డుకాకపోవడం ఇదే తొలిసారి.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

Mumbai, October 18: కరోనావైరస్ ఫస్ట్‌, సెకండ్‌వేవ్‌తో అతలాకుతలమైన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా శాంతించింది. గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా మరణం (Mumbai Reports Zero COVID-19 Death ) కూడా నమోదవ్వలేదు. మహమ్మారి విజృంభించినప్పటి నుంచి ఒక రోజులో మరణాలు రికార్డుకాకపోవడం ఇదే తొలిసారి.

ప్రస్తుతం నగరంలో 5,030 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. గత ఏడాది మార్చి నుంచి శనివారం వరకు ప్రతి రోజు కరోనా కేసులతోపాటు మరణాలు నమోదయ్యాయి. అయితే గత 24 గంటల్లో కొత్తగా 367 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌ బారినపడిన వారెవరూ మరణించలేదు. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ గణాంకాల ప్రకారం 2020 మార్చి 26న కూడా జీరో మరణాలు నమోదయ్యాయి. మరోవైపు ముంబైలో కరోనా కేసుల సంఖ్య 7,50,808కి, కరోనా మరణాల సంఖ్య 16,180కి చేరింది. కరోనా మరణాలు నమోదు కాకపోవడంపై సీఎం ఆదిత్య థాకరే (Aditya Thackeray) స్పందిస్తూ ఇది మంచి శుభవార్తని తెలిపారు. కరోనా నియంత్రణపై చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు.

దేశంలో కొత్తగా 13,596 మందికి కోవిడ్, గత 24 గంటల్లో కొత్తగా 19,582 మంది బాధితులు డిశ్చార్జ్, ప్రస్తుతం దేశంలో 1,89,694 యాక్టివ్ కేసులు

భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,596 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో 1,89,694 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కాగా.. కరోనా నుంచి ఇప్పటి వరకూ 3,34,39,331 మంది కోలుకున్నారు. భారత్‌లో ఇప్పటి వరకూ 97.79 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేస్తున్నారు.