దేశంలో కొత్తగా 13,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం గత 230 రోజుల్లో (సుమారు 8 నెలలు) ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 3,40,81,315కు చేరాయని తెలిపింది. ఇందులో 1,89,694 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,34,39,331 మంది కోలుకున్నారని వెల్లడించింది. మరో 4,52,290 మంది కరోనా వల్ల మరణించారని పేర్కొన్నది. గత 24 గంటల్లో కొత్తగా 19,582 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడగా, మరో 166 మంది మరణించారని తెలిపింది. దీంతో రికవరీ రేటు 98.12 శాతం, మరణాల రేటు 1.33 శాతం అని వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 97.79 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
COVID19 | India reports 13,596 new cases in the last 24 hours; lowest in 230 days. Active caseload stands at 1,89,694: Ministry of Health and Family Welfare pic.twitter.com/nxuu17yVXX
— ANI (@ANI) October 18, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)