Mumbai Shocker: శాడిస్ట్ భర్త..పోర్న్ స్టార్‌గా మారాలంటూ భార్యపై ఒత్తిడి, ప్రైవేట్ భాగాలలో వస్తువు చొప్పించి తీవ్ర వేధింపులు, తట్టుకోలేక ఖర్గ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

ఓ శాడిస్ట్ భర్త తన భార్య‌ను పోర్న్ స్టార్‌గా మారాల‌ని భ‌ర్త ఒత్తిడి తీసుకురావ‌డంతో పాటు ఆమె ప్రైవేట్ భాగాల్లో వ‌స్తువును చొప్పించి తీవ్ర వేధింపుల‌కు (object inserted in private parts by husband) గురిచేశాడు

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Mumbai, July 26: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ శాడిస్ట్ భర్త తన భార్య‌ను పోర్న్ స్టార్‌గా మారాల‌ని భ‌ర్త ఒత్తిడి తీసుకురావ‌డంతో పాటు ఆమె ప్రైవేట్ భాగాల్లో వ‌స్తువును చొప్పించి తీవ్ర వేధింపుల‌కు (object inserted in private parts by husband) గురిచేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫిజియోథెరిపిస్టుగా ప‌నిచేసే మ‌హిళ (29) 2014లో నిందితుడిని వివాహం చేసుకుంది. వీరికి ఇప్ప‌టివ‌ర‌కూ పిల్ల‌లు లేరు. సంతానం క‌ల‌గ‌లేద‌ని కూడా మ‌హిళను అత్తింటివారు వేధించార‌ని పోలీసులు వెల్ల‌డించారు.

అశ్లీల వీడియోల‌కు బానిసైన నిందితుడు భార్య‌ను పోర్న్ స్టార్‌గా (woman forced into pornography) మారాల‌ని ఒత్తిడి తెచ్చేవాడు. ఈ క్ర‌మంలో రాత్రి వేళ ఆమె నిద్రిస్తుండ‌గా గుర్తుతెలియ‌ని వ్య‌క్తికి వీడియో కాల్ ద్వారా లైవ్ స్ట్రీమిగ్ చేశాడు. భ‌ర్త ఆగ‌డాలు భ‌రించ‌లేని మ‌హిళ ఖ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ దారుణం వెలుగులోకి వ‌చ్చింది. మ‌హిళ కుటుంబ స‌భ్యులు ఆమెను తిరిగి మెట్టినింటికి పంప‌మ‌ని చెప్ప‌డంతో ట్రిపుల్ త‌లాక్‌తో తెగ‌తెంపులు చేసుకోవాల‌ని నిందితుడి కుటుంబ స‌భ్యులు కోరుతున్నార‌ని బాధితురాలు వెల్ల‌డించారు.

సోషల్ మీడియాలో పరిచయం, అర్థరాత్రి ఇంటిలోకి దూరి బాలికపై అత్యాచారం, హైదరాబాద్‌లో దారుణ ఘటన, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఆమె డాక్యుమెంట్లు, పాస్‌పోర్ట్ స‌హా ఇత‌ర వ‌స్తువులు, ప‌త్రాల‌ను ఇవ్వ‌కుండా వేధిస్తున్నార‌ని తెలిపారు. కాగా నిందితుడిని అరెస్ట్ చేశామ‌ని, అత‌డి మొబైల్ ఫోన్ సీజ్ చేసి ఫోరెన్సిక్ ప‌రీక్ష‌కు పంపామ‌ని పోలీసులు చెప్పారు. నిందితుడిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

భారీ వర్షాలకు వణికిన మహారాష్ట్ర, 164 మంది మృతి, మరో 100 మంది గల్లంతు, రాయ్‌గడ్, రత్నగిరి, కొల్హాపూర్, సతారాతో సహా పలు జిల్లాల్లో దారుణ పరిస్థితులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం థాకరే పర్యటన

నిందితుడు ముంబైలో ప్రముఖ హోటల్ యజమాని కుమారుడని సమాచారం. కాగా పిల్లలు పుట్టలేదని అత్తింటి వారు వేధింపులకు గురి చేసేవారని వాస్తవానికి, ఆమె భర్త తన పట్ల తన బాధ్యతలను నిర్వర్తించలేకపోతున్నారని అందువల్లే పిల్లలు పుట్టడం లేదని భాదితురాలు ఆరోపించింది.