Mumbai Shocker: ప్రియుడితో బెడ్ రూంలో ఆ పనిలో ఉండగా, భర్త సడన్‌గా ఎంట్రీ, ఇద్దరూ కలిసి అతన్ని స్టీల్ రాడ్ తో కొట్టి చంపేశారు, ముంబైలో దారుణ ఘటన

అంధేరీ ఈస్ట్‌లోని తన భర్తను చంపి మృతదేహాన్ని తమ ఇంటి మంచంలో దాచిపెట్టినందుకు 22 ఏళ్ల మహిళ మరియు ఆమె ప్రియుడిని సకినాకా పోలీసులు అరెస్టు (Wife and boyfriend arrested) చేశారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Mumbai, July 20: దేశ ఆర్థిక రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అంధేరీ ఈస్ట్‌లోని తన భర్తను చంపి మృతదేహాన్ని తమ ఇంటి మంచంలో దాచిపెట్టినందుకు 22 ఏళ్ల మహిళ మరియు ఆమె ప్రియుడిని సకినాకా పోలీసులు అరెస్టు (Wife and boyfriend arrested) చేశారు. జులై 18న జరిగిన ఈ ఘటనలో మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడైన భార్య మరియు ఆమె ప్రియుడు ఆ వ్యక్తిని స్టీల్ రాడ్ తో కొట్టి, తరువాత దిండుతో గొంతు అదిమిపట్టి (killing husband in Sakinaka) చంపారు.మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

నిందితుడు భార్య రుబీనా ఖాన్‌గా గుర్తించబడింది, ఆమె తన భర్త నసీమ్ ఖాన్‌తో కలిసి అంధేరిలోని సకినాకా ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటోంది. మరో నిందితుడిని రుబీనా ప్రియుడు, మృతుడి మేనల్లుడు సైఫ్ ఖాన్‌గా గుర్తించారు. వీరు భర్త లేని సమయంలో ఏకాంతంగా కలిసేవారు. ఓ రోజు అలాగే కలిసి ఉండగా భర్త వీరిద్దరిని చూడటంతో గొడవ అయింది. అప్పటి నుంచి ఈ జంట ఇంట్లో తరచూ గొడవ పడేవారు.

చాక్లెట్ ఆశచూపి.. ఏడేళ్ల బాలుడిని తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన పుణే పోలీసులు

ఈ నేపథ్యంలో ఓ రోజు ఖాన్ నిద్రిస్తున్నప్పుడు, రుబీనా అతన్ని కొట్టడంతో అతను స్పృహతప్పి పడిపోయాడు. భయాందోళనకు గురైన రుబీనా సైఫ్‌ను పిలిచి, ఇద్దరూ దిండుతో గొంతు అదిమిపట్టి చంపారు. భార్యాభర్తల కాల్ రికార్డులను పరిశీలించిన పోలీసులు. అతని ఒంటిపై ఉన్న గీతలు గుర్తించి మృతుడి మేనల్లుడిని గట్టిగా విచారించారు. అతను నేరాన్నిఅలాగే రుబీనాతో తన సంబంధాన్ని అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.