Image used for representational purpose | (Photo Credits: File Image)

Pune, July 20: పుణేలో దారుణ ఘటన (Pune Shocker) చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలుడితో అసహజ సంభోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై (Man arrested for unnatural sex) 27 ఏళ్ల యువకుడిని పింప్రి-చించ్‌వాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అలీమ్ మూసా షేక్‌గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన జూలై 17 న జరిగింది. బాలుడి (7-year-old boy) కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా అదే రోజు పోలీస్ స్టేషన్‌లో ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, తోటలో ఆడుకుంటున్న బాలుడికి చాక్లెట్ ఇస్తానని ఆ వ్యక్తి ఎర చూపాడు. అనంతరం బాలుడితో అసహజ సెక్స్‌లో పాల్గొని అక్కడి నుంచి పరారయ్యాడని పేర్కొంది. విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఈ కేసుపై విచారణ ప్రారంభించారు. పోలీసులు నేరం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. తదుపరి విచారణలో నిందితుడిని గుర్తించి జూలై 18న అరెస్టు చేశారు.

పోలీస్ అధికారి దారుణం, బాలికకు మద్యం తాగించి..హోటల్ రూంకి తీసుకువెళ్లి అత్యాచారం, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులు

మరో ఘటనలో అప్పులపాలైన ఒక వ్యాపారి కుటుంబంతో కలిసి కారులో నిప్పటించుకున్నాడు. కారుతో సహా మంటల్లో కాలి అతడు మరణించగా భార్య, కుమారుడు తప్పించుకున్నారు. అయితే వారికి తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో పరిస్థితి సీరియస్‌గా ఉన్నది. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ సంఘటన జరిగింది. 58 ఏళ్ల రామరాజ్ భట్ తన భార్య, కుమారుడ్ని మంగళవారం ఒక హోటల్‌కు లంచ్‌కు తీసుకెళ్లాడు.

అనంతరం లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లారు. ఆ తర్వాత కారును రోడ్డు పక్కగా ఆపాడు. డ్రైవింగ్‌ సీటులో ఉన్న రామరాజ్‌ భట్‌ ఉన్నట్టుండి తనపై పెట్రోల్‌ పోసుకున్నాడు. కారులో ఉన్న 57 ఏళ్ల భార్య సంగీత భట్, 25 ఏళ్ల కుమారుడు నందన్‌పై కూడా పెట్రోల్‌ పోశాడు. అనంతరం తాను నిప్పటించుకుని వారికి కూడా నిప్పు అంటించాడు. రామరాజ్‌ భట్‌ సజీవ దహనం కాగా, ఆ కారు మంటల్లో కాలిపోయింది. కాగా, కారు వెనుక సీటులో కూర్చొన్న వ్యాపారి భార్య, కుమారుడు ఎలాగోలా డోర్‌ తెరిచి బయటపడ్డారు. అయితే వారికి కూడా తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి.

స్కూలులో బాలికపై 5గురు కామాంధుల కన్ను, వారి నుంచి తప్పించుకోవడానికి పాఠశాల భవనంపై నుంచి దూకేసిన బాధితురాలు, పరిస్థితి విషమం

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు మంటలను అదుపుచేశారు. మరోవైపు ఆ కాలిన కారులో ఉన్న బ్యాగ్‌లో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు గుర్తించారు. అప్పుల సమస్యల వల్ల తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆ వ్యాపారి అందులో రాసినట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.