![](https://test1.latestly.com/wp-content/uploads/2021/11/rape-sexual-abuse.jpg)
Mumbai, July 19: మహారాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అమరావతి జిల్లాలోని ఓ హోటల్‌లో 17 ఏండ్ల యువతిపై ఎస్ఐ లైంగిక దాడికి (17-year-old girl raped by Police Sub-Inspector) పాల్పడ్డాడు. బాధితురాలు, నిందితుడిది ఒకే గ్రామమని, వీరిద్దరికీ పరిచయం ఉందని పోలీసుల విచారణలో తెలిసింది. అమరావతి జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక నాగపూర్‌లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటోంది.
జులై 13న బాలికను కారులో నగరంలో తిప్పిన నిందితుడు (Police Sub-Inspector) ఆమెకు మద్యం తాగించి ఆపై హోటల్ రూంకు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించాడు. మరుసటి రోజు ఇంటికి తిరిగివచ్చిన బాలిక జరిగిన విషయం కుటుంబసభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాగపూర్ పోలీసులు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఎస్ఐ (35)ని అరెస్ట్ చేశారు. IPCలోని సెక్షన్లు 363 (కిడ్నాప్), 376 (రేప్) మరియు లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించడం వంటి ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేయబడింది. (పోక్సో) చట్టం నమోదు చేశామని ఆయన తెలిపారు. పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.