Nara Lokesh Meets Amit Shah: ఫలించిన పురందేశ్వరి రాయబారం, కేంద్రహోంమంత్రి అమిత్ షాతో నారాలోకేష్ భేటీ, సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Lokesh Meets Amit Shah) కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ (CBN Arrest) వ్యవహారాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అమిత్ షాకు ఫిర్యాదు చేశారు నారా లోకేశ్. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనను కూడా వేధిస్తున్నారని చెప్పారు లోకేశ్.

Nara Lokesh Meets Amit Shah: ఫలించిన పురందేశ్వరి రాయబారం, కేంద్రహోంమంత్రి అమిత్ షాతో నారాలోకేష్ భేటీ, సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు
Nara Lokesh Meets Amit Shah (PIC@ Nara Lokesh X)

New Delhi, OCT 12: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Lokesh Meets Amit Shah) కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ (CBN Arrest) వ్యవహారాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అమిత్ షాకు ఫిర్యాదు చేశారు నారా లోకేశ్. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనను కూడా వేధిస్తున్నారని చెప్పారు లోకేశ్. చివరికి తన తల్లి భువనేశ్వరి, తన భార్య బ్రాహ్మణిలను కూడా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షాకు కంప్లైంట్ చేశారు లోకేశ్. చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు? నీపై ఎన్ని కేసులు పెట్టారు? అని లోకేశ్ ను అడిగారు అమిత్ షా. 73ఏళ్ల వయసున్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు అమిత్ షా. చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది? అని కూడా అడిగి తెలుసుకున్నారు అమిత్ షా. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని చెప్పారు అమిత్ షా. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandeswari), తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కూడా పాల్గొన్నారు.

Amaravati IRR alignment Case: రెండో రోజు ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ, ఢిల్లీకి బయలుదేరిన టీడీపీ జాతీయ కార్యదర్శి, ఈ రోజు విచారణపై ఏమన్నారంటే.. 

ఏపీలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు లోకేశ్. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో (IRR Case) విచారణకు హాజరైన నారా లోకేశ్.. సీఐడీ విచారణ ముగిసిన వెంటనే ఢిల్లీకి వెళ్లిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు. పురంధేశ్వరి, కిషన్ రెడ్డి సమక్షంలో అమిత్ షా నివాసంలో ఆయనను లోకేశ్ కలిశారు. చంద్రబాబు అరెస్ట్, తమ కుటుంబంపై ఏ విధంగా జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అన్నది అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు నారా లోకేశ్.

Amaravati Inner Ring Road Case: చంద్రబాబుకు కాస్త ఊరట, సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని కోర్టు ఆదేశాలు, రైట్ టు ఆడియెన్స్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు 

కేసులు పెట్టి విచారణ పేరుతో తనను కూడా వేధిస్తున్నారని అమిత్ షాకి ఫిర్యాదు చేశారు నారా లోకేశ్. ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో వివిధ కేసులు పెండింగ్ లో ఉన్నాయని, విచారణ జరుగుతోందని, న్యాయపోరాటం చేస్తున్నామన్న అంశాన్ని కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు నారా లోకేశ్. 73ఏళ్ల వయసున్న వ్యక్తిని కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, ఇది కరెక్ట్ కాదన్న అంశాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు లోకేశ్. 73ఏళ్ల వయసున్న వ్యక్తిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సరికాదు, మంచిది కాదు అన్న అభిప్రాయాన్ని అమిత్ షా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు ఆరోగ్యం గురించి, ఆయన యోగ క్షేమాలు గురించి అమిత్ షా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.

గతంలో నారా లోకేశ్ రాష్ట్రపతిని కలిసి సీఎం జగన్ పై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. ఇప్పుడు కేంద్రహోంమంత్రి అమిత్ షాని కలిసి జగన్ పై నారా లోకేశ్ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ప్రస్తుతం కోర్టుల పరిధిలో ఉంది. పలు కేసులపై విచారణలు జరుగుతున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసు.. ఇవన్నీ కూడా దర్యాఫ్తు దశలో ఉన్నాయి. అంతేకాదు కోర్టుల పరిధిలో ఉన్న అంశాలు. కోర్టుల పరిధిలో ఉన్న అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కానీ, వివరణ అడగటం కానీ ఇటువంటివి ఏవీ జరగవు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)



సంబంధిత వార్తలు

Delhi Railway Station Stampede: మహాకుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీ రైల్వేస్టేషన్‌ లో భారీ తొక్కిసలాట.. 15 మంది మృతి.. మరో 30 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు.. స్టేషన్ లో భయానక దృశ్యాలు (వీడియో)

Pawan Kalyan Donates Rs 50 Lakhs To NTR Trust: ఎన్టీఆర్ ట్రస్ట్‌కు పవన్‌ కల్యాణ్ భారీ డొనేషన్‌, టికెట్‌ కొనలేదు అందుకే రూ. 50 లక్షలు ఇస్తున్నా అంటూ ప్రసంగం

Delhi Metro Viral Video: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో గేట్లు దూకి లోపలికి దూసుకొచ్చిన ప్రయాణికులు! వైరల్‌గా మారిన వీడియో, క్లారిటీ ఇచ్చిన ఢిల్లీ మెట్రో

Mohan Babu Bouncers: మరోసారి రెచ్చిపోయిన మోహన్ బాబు బౌన్సర్లు.. F5 రెస్టారెంట్ ధ్వంసం, ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడి చేస్తారా అని మంచు మనోజ్ ఫైర్

Share Us