New Covid Strains: కరోనా రోగులపై మళ్లీ కొత్త స్ట్రెయిన్లు దాడి, హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం కష్టమని తెలిపిన ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా, ఆరు రాష్ట్రాల్లో కరోనా వేగంగా వ్యాప్తి
రణదీప్ గులేరియా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.ఇండియాలో వెలుగుచూసిన కొత్త స్ట్రెయిన్లు వేగంగా వ్యాపించడమే కాకుండా మరింత ప్రమాదకరంగా (New Covid Strains) మారొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
New Delhi: భారత్‌లో కొత్త కరోనా స్ట్రెయిన్లు వెలుగు చూశాయన్న వార్తల నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.ఇండియాలో వెలుగుచూసిన కొత్త స్ట్రెయిన్లు వేగంగా వ్యాపించడమే కాకుండా మరింత ప్రమాదకరంగా (New Covid Strains) మారొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో పాటుగా గతంలో కరోనా బారిన పడి కోలుకున్న వారికి మళ్లీ కరోనా సోకి రీఇన్ఫెక్షన్లకు (More Infectious) దారి తీసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
హెర్డ్ ఇమ్యూనిటీపై (Herd immunity) కూడా ఆయన స్పందించారు. ఇదో అభూతకల్పన అని వ్యాఖ్యానించిన గులేరియా (AIIMS Chief Dr Randeep Guleria) దేశంలోని 80 శాతం మందిలో కరోనా నిరోధక యాంటీబాడీలు ఉన్నప్పుడే ఈ మహమ్మారికి అడ్డుకోవడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నియంత్రణకు భారతదేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం చాలా కష్టం అని, భారత్‌లో ఆచరణయోగ్యం కాదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా పేర్కొన్నారు.
వివిధ రకాల కొవిడ్ స్ట్రెయిన్లు (New Indian Covid variants) వెలుగులోకి వస్తుండటంతోపాటు ఇమ్యూనిటీ క్షీణిస్తున్న సమయంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం అసాధ్యం అని చెప్పారు. జైపూర్‌లో జరుగుతున్న లిటరరీ ఫెస్టివల్‌లో తాను తాజాగా రాసిన ‘టిల్ వుయ్ విన్: ఇండియాస్ ఫైట్ ఎగనెస్ట్ ది కొవిడ్-19 పాండమెక్’ పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు. పబ్లిక్ పాలసీ అండ్ హెల్త్ సిస్టమ్స్ నిపుణుడు చంద్రకాంత్ లహారియా, పేరొందిన వ్యాక్సిన్ రీసెర్చర్ అండ్ వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్‌లతో కలిసి రణ్‌దీప్ గులేరియా ఈ పుస్తకాన్ని రాశారు.
బ్రెజిల్‌లోని మనౌస్ నగరంలో గతేడాది హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినా.. ఇప్పుడు కొవిడ్-19 సెకండ్ వేవ్‌ను (Covid Second Wave) ఎదుర్కొంటున్నదని రణదీప్ గులేరియా గుర్తు చేశారు. శరవేగంగా ఇన్‌ఫెక్షన్లు పెరగడంతో బ్రెజిల్‌లో 70 శాతం మంది ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీ సాధించారని, కానీ మెజారిటీ ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంతో తిరిగి ఇన్‌ఫెక్షన్ల భారీన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శుక్రవారం నమోదైన కేసుల్లో దాదాపు సగం (6,112) కేసులు మహారాష్ట్రకు చెందినవే. కేరళలో రోజుకు 4వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఆరు రాష్ర్టాల నుంచే రోజూ 87% కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్యపరంగా కూడా మహారాష్ట్ర అధ్వాన్న స్థితిలో ఉన్నది. శుక్రవారం 101 మరణాలు నమోదు కాగా.. మహారాష్ట్రలో 44 మంది చనిపోయారు. దీంతో వైరస్ కట్టడి కోసం ఈ ఆరు రాష్ర్టాల ప్రభుత్వాలు తిరిగి కఠిన చర్యలు చేపడుతున్నాయి.