Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, Feb 21: దేశంలో గత 24 గంటల్లో 14,264 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,667 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,91,651కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 90 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,302 కు (Covid deaths) పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,89,715 (Covid in India) మంది కోలుకున్నారు.

1,45,634 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,10,85,173 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,09,31,530 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,70,050 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తెలంగాణలో కొత్త‌గా 163 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 146 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,598 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,94,243 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,624 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,731 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 678 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 29 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

మళ్లీ డేంజర్ జోన్‌లోకి అయిదు రాష్ట్రాలు, ఇండియాలో 7,569 కొత్త వేరియంట్లు గుర్తించామని తెలిపిన సీసీఎంబీ, మహారాష్ట్రను వణికిస్తున్న కరోనావైరస్, దేశంలో 13,993 కొత్త కేసులు

గడచిన 24 గంటల్లో ఏపీలో 26,436 కరోనా పరీక్షలు నిర్వహించగా 54 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 19 మంది కరోనా బారినపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 6 కేసులు గుర్తించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 70 మంది కొవిడ్ ప్రభావం నుంచి కోలుకోగా, రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 8,89,210 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,439 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 604 మందికి చికిత్స జరుగుతోంది. అటు, కరోనా మృతుల సంఖ్య 7,167గా నమోదైంది.

మహారాష్ట్రని వణికిస్తున్న కొత్త వేరియంట్లు, దేశంలో తాజాగా 13,993 మందికి కరోనా, ఏపీలో కొత్తగా 79 కోవిడ్ కేసులు, తెలంగాణలో 157 మందికి కరోనా, జపాన్‌లో న్యూ కోవిడ్ వేరియంట్

ముంబైలో కొత్తగా 2,749 కేసులు (Mumbai Covid) నమోదు కావడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అలర్ట్ అయింది. కోవిడ్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. నగరంలోని 1,305 బిల్డింగులను అధికారులు మూసేశారు. అధికారులు సీల్ చేసిన బిల్డింగుల్లో 71,838 కుటుంబాలు నివసిస్తున్నాయి. కరోనా కేసులు బయటపడ్డ ఈ బిల్డింగుల నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీఎంసీ (BMC) సరికొత్త నిబంధనలను జారీ చేసింది. ఏ రెసిడెన్సియల్ బిల్డింగ్ లోనైనా ఐదుకు మించి యాక్టివ్ కేసులు ఉంటే... ఆ భవనాన్ని సీల్ చేస్తారు. విదేశాల నుంచి ముంబైకి వచ్చేవారు కచ్చితంగా ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారి చేతులపై స్టాంప్ వేస్తారు. వివాహాలు జరుగుతున్న వేదికలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనే విషయాలను చెక్ చేస్తున్నారు. 50 మందికి మించి పెళ్లిళ్లకు హాజరు కాకూడదు. రెస్టారెంట్లు కూడా 50 శాతం కెపాసిటీతో మాత్రమే పని చేయాలి.

విరుచుకుపడుతున్న కొత్త వేరియంట్లు, భారత్‌లో ఏకంగా ఐదు వేల రకాల కరోనా స్ట్రెయిన్లు, సంచలన వివరాలను వెల్లడించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు

మరోవైపు గత 24 గంటల్లో మహారాష్ట్ర వ్యాప్తంగా 6,112 కొత్త కేసులు (Maharashtra Coronavirus) నమోదయ్యాయి. ఇదే సమయంలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44,765 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 20,87,632కి చేరింది. 51,713 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ ప్రభావం మళ్లీ పెరుగుతుండటంతో మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడం వంటి వాటిని కచ్చితంగా పాటించేలా చేసేందుకు ప్రభుత్వం మార్షల్స్ ను నియమించింది.

మహారాష్ట్రలో కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) కీలక ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి వచ్చేవారు కచ్చితంగా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని... నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే వారిని కర్ణాటకలోని అనుమతిస్తామని తెలిపింది. టెస్టు రిపోర్టు కూడా 72 గంటల్లోపు వచ్చినది అయ్యుండాలని చెప్పింది. మహారాష్ట్ర నుంచి వచ్చేవారంతా... హోటళ్లు, హాస్టళ్లు, రిసార్టులు, డార్మెటరీలు లేదా ఇళ్లకు వచ్చేవారంతా తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని 72 గంటలు దాటని ఆర్టీ-పీసీఆర్ రిపోర్టును అందజేయాలి.

టెస్ట్ రిపోర్టు లేకపోతే వారిని రాష్ట్రంలోకి అనుమతించము' అని ప్రకటనలో తెలిపింది. అంతేకాదు, గత రెండు వారాల్లో మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని ఆదేశించింది. ఎంఎన్సీలు, హోటళ్లు, రిసార్టులు, లాడ్జిల్లో పని చేస్తున్న మహారాష్ట్ర వాసులందరూ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది.