New Maruti Suzuki Dzire: మారుతి సుజుకి నుంచి సరికొత్తగా డిజైర్ వచ్చింది, ధర రూ. 6.79 లక్షల నుంచి ప్రారంభం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

డిజైర్ ఫీచర్లు మరింత డెవలప్ చేసి విపణిలోకి తీసుకువచ్చింది. డిజైన్, సేఫ్టీ, టెక్నాలజీ, పవర్ ట్రైన్, కంఫర్ట్, సేఫ్టీ, స్టైల్‌గా రూపుదిద్దుకుని ఈ బండి మార్కెట్లోకి వచ్చింది

New Maruti Suzuki Dzire (Photo-Maruthi)

ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తన ఫోర్త్ జనరేషన్ సెడాన్ `డిజైర్`ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. డిజైర్ ఫీచర్లు మరింత డెవలప్ చేసి విపణిలోకి తీసుకువచ్చింది. డిజైన్, సేఫ్టీ, టెక్నాలజీ, పవర్ ట్రైన్, కంఫర్ట్, సేఫ్టీ, స్టైల్‌గా రూపుదిద్దుకుని ఈ బండి మార్కెట్లోకి వచ్చింది. దీని ధర  సుమారు. 6.79 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. రూ.11 వేలు చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చునని గత వారమే మారుతి సుజుకి తెలిపింది.

కొత్త డిజైర్‌లో స్లీక్‌ ప్రొజెక్టర్‌ హెడ్‌ ల్యాంప్స్‌, డీఆర్‌ఎల్‌, టర్న్‌ ఇండికేటర్ల ఇంటిగ్రేషన్‌, ఫాగ్‌ లైట్స్‌ను కూడా సరికొత్త డిజైన్‌లో తీసుకొచ్చారు. డైమండ్‌ కట్ అలాయ్‌ వీల్స్‌, వై ఆకారంలో ఎల్‌ఈడీతో కూడిన టెయిల్‌ ల్యాంప్‌ను ఆధునిక లుక్‌లో తీసుకొచ్చారు. 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ ఇచ్చారు. ఇది యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోకు సపోర్ట్‌ చేస్తుంది.

స్కోడా కైలాక్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదల, రూ.7.89 లక్షలు నుంచి ప్రారంభం, బుకింగ్‌లు డిసెంబర్‌ 2 నుంచి..

ఆర్కామిస్‌ సౌండ్‌ సిస్టమ్‌, ఆటో ఫోల్డింగ్‌ ORVMs, క్రూయిజ్‌ కంట్రోల్‌, రియర్‌ డీఫాగర్‌, టైప్‌-సి ఛార్జింగ్‌ పోర్ట్స్‌ వంటివి ఇచ్చారు. ఫ్యాక్టరీ ఫిటెడ్‌ సన్‌రూఫ్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, రియర్‌ ఏసీ వెంట్స్‌ వంటి ఫీచర్లను తొలిసారిగా డిజైర్‌లో ఇచ్చారు. హై ఎండ్‌ మోడళ్లలో 360 డిగ్రీల కెమెరా కూడా ఇచ్చారు. గ్లోబల్ ఎన్-క్యాప్ క్రాష్ టెస్ట్‌ల్లో 5-స్టార్ రేటింగ్ అడల్ట్ , చైల్డ్ ఆక్యుపెంట్ సేఫ్టీలో 4-స్టార్ రేటింగ్ కలిగి ఉంటుందీ కారు.

న్యూ డిజైర్ కారు తాజా మారుతి జడ్- సిరీస్ 1.2 లీటర్ల 3- సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. గరిష్టగా 82 హెచ్పీ విద్యుత్, 112 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఏఎంటీ ఆప్షన్లలో లభిస్తుంది.