IMD Alert: ఉత్తరభారత్‌కు భారీ వర్షసూచన, మరో నాలుగు రోజులు అలర్ట్‌గా ఉండాలంటూ హెచ్చరిక, ఉత్తరాంఖడ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌ల్లో భారీ వర్షాలు పడే అవకాశం

వాయువ్య భారతంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా (Imd Issues Alert) వేసింది.

Rains

New Delhi, AUG 22: రాగల మూడు నాలుగు రోజుల్లో ఉత్తరాఖండ్ (Uttarakhand), హిమాచల్ ప్రదేశ్ (Himachal pradesh), ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కీం, ఈశాన్య భారతంలోని ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. వాయువ్య భారతంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా (Imd Issues Alert) వేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లో శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో, ఉత్తర పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మధ్య భారతదేశంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి విస్తారంగా వానలుపడే సూచనలున్నాయని చెప్పుకొచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో బుధ, శుక్రవారాలు, ఒడిశాలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు, జార్ఖండ్‌లో బుధ, గురువారాల్లో, బీహార్‌లో మంగళవారం నుంచి శనివారం వరకు వానలు కొనసాగే అవకాశాలున్నాయని ఐఎండీ వెల్లడించింది.

Chandrayaan 3 Update: విక్రమ్ ల్యాండర్ పంపిన లేటెస్ట్ ఫోటోలు ఇవిగో, మరి కొద్ది గంటల్లో చందమామపై దిగనున్న ల్యాండర్, ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా.. 

పశ్చిమ బెంగాల్‌, సిక్కీంలో గురు, శుక్రవారాల్లో, బిహార్‌లో మంగళ, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈశాన్య భారతంలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు విస్తారంగా వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. అసోం, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆదివారం వరకు వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. దక్షిణ భారతంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తమిళనాడులో మంగళవారం భారీ వర్షాలు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.