Night Curfew in Punjab: డిసెంబర్ 1 నుంచి రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ, కీలక నిర్ణయం తీసుకున్న పంజాబ్ ప్రభుత్వం, డిసెంబరు 15 తర్వాత సమీక్షపై ఆలోచన
ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. తాజాగా పంజాబ్ ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి రాత్రి పూట కర్ఫ్యూ (Night Curfew in Punjab) విధించింది.
Amritsar, November 25: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. తాజాగా పంజాబ్ ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి రాత్రి పూట కర్ఫ్యూ (Night Curfew in Punjab) విధించింది.
దేశంలో కరోనా మరోసారి విజృంభించనుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ (Punjab Chief Minister Capt. Amarinder Singh) కోవిడ్ కట్టడి కోసం కర్ఫ్యూని విధించనున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 1 నుంచి రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ (Complete Shutdown From 10 PM to 5 AM) అమల్లోకి రానున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ బుధవారం తెలిపారు. ఇక కోవిడ్ నిమయాలను అతిక్రమించే వారికి విధించే జరిమానాలను కూడా రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. ప్రొటోకాల్ పాటించని వారికి 1000 రూపాయల జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు. అంతేకాక రెస్టారెంట్లు, హోటల్స్, వివాహాది వేడుకలు వంటివి రాత్రి 9.30 గంటలలోపు ముగించాలని ఆదేశించారు.
డిసెంబరు 15 తర్వాత వీటిని సమీక్షిస్తామని తెలిపారు. ఇక ఇప్పటి వరకు పంజాబ్‌లో 1,47,655 కేసులు ఉండగా.. 1,36,000 మంది కోలుకున్నారు. 6,834 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఇప్పటివరకు పంజాబ్‌లో కోవిడ్ బారిన పడి 4,653 మంది మరణించారు.