Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, November 25: భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,376 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు (Covid Cases in India) వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 92,22,217కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 4,44,746 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక గత ఇరవై నాలుగు గంటల్లో 37,816 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోవిడ్‌ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 86,42,771కు చేరింది. కాగా కొత్తగా 481 కోవిడ్‌ మరణాలు సంభవించడంతో భారత్‌లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,34,699కు (Covid Deaths in India) చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు (Delhi Coronavirus) నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,40,541కు చేరింది. గడచిన 24 గంటల్లో 4,943 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ ఢిల్లీలో మొత్తం 4,93,419 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం 38,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా దేశరాజధానిలో గంటకు ఐదుగురు చొప్పున మృత్యువాత పడుతున్నారు.

ఢిల్లీలో కరోనాతో పెరుగుతున్న మరణాలు, అసోం మాజీ సీఎం తరుణ్ గొగాయ్ కన్నుమూత, కరోనాతో ఒడిషా గవర్నర్ భార్య, గాంధీ మనవడు సతీష్ ధుపేలియా మృతి

దీనికిముందు సోమవారం కరోనాతో 121 మంది మృతి (Covid Deaths in Delhi) చెందారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ పండుగల సీజన్‌లో కరోనా నియమాలను చాలామంది ఉల్లంఘించారు. అలాగే పెళ్లిళ్లకు కూడా భారీగా హాజరవుతూ కరోనా ముప్పు పొంచివుందన్న విషయాన్నే మరచిపోయారు. అందుకే కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రజలంతా కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.

రష్యా రూపొందించిన స్పుత్నిక్‌ కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ఉత్పత్తిదారులు తెలిపారు. రెండు డోసుల్లో ఇచ్చే ఈ టీకాను అంతర్జాతీయ మార్కెట్లో 10 డాలర్ల లోపే ఇస్తామని, రష్యా పౌరులకు మాత్రం ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. వ్యాక్సిన్‌ను 2–8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాల్సి ఉంటుందన్నారు. తొలిడోసు ఇచ్చిన 42 రోజుల అనంతరం సేకరించిన డేటా ఆధారంగా టీకా ప్రభావాన్ని లెక్కించామని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, గమలేయా రిసెర్చ్‌ సెంటర్, ఆర్‌డీఐఎఫ్‌ ప్రకటించాయి.

కరోనా చికిత్సకు ఉపయోగించే రెమిడిసివిర్‌ సస్పెండ్, దాంతో ఎటువంటి ప్రయోజనం లేదని తెలిపిన డబ్ల్యూహెచ్‌వో, అమెరికా జూనియర్ ట్రంప్‌కి కోవిడ్ పాజిటివ్

ఇదిలా ఉంటే యూఏఈ, ఫిన్‌ల్యాండ్, లెబనాన్‌ దేశాల్లో రోగుల్లో కరోనా లక్షణాలు బయటపడక ముందే శునకాలు రోగుల్ని గుర్తిస్తున్నాయి. లెబనాన్‌ విమానా శ్రయానికి వచ్చిన 1,680 మంది ప్రయాణికుల్లో 159 మందిని కరోనా రోగులుగా శునకాలు గుర్తిస్తే, వారిలో 92 శాతం మందికి కరోనా ఉన్నట్టుగా ఆ తర్వాత తేలిందని అధికారులు చెప్పారు.