World Health Organization (File Photo)

Geneva, Nov 21: రెమిడిసివిర్‌‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్‌ చికిత్సలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ యాంటీవైరల్ మెడిసిన్ రెమిడిసివిర్‌ను (WHO on Remdesivir) ప్రపంచ ఆరోగ్య సంస్థ సస్పెండ్ చేసింది. రెమిడెసివిర్‌తో కలిగే ప్రయోజనం ఏమీ లేదని..ఆస్పత్రిలో చేరిన కోవిడ్‌ రోగులకు (Covid Patients) రెమిడెసివిర్‌ ఇవ్వొద్దని వైద్యులకు సూచించింది. ఈ ఔషధంతో రోగుల ప్రాణాలు కాపాడగలమనడానికి ఆధారాలు లేవని పేర్కొంది. మేము దీనిని పిక్యూ (ప్రీక్వాలిఫికేషన్ జాబితా) నుండి సస్పెండ్ చేసామని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి తారిక్ జసారెవిక్ వార్తా సంస్థ రాయిటర్స్‌కు ఇమెయిల్ పంపిన ప్రతిస్పందనలో చెప్పారు.

కాగా ఇప్పటివరకు కోవిడ్-19 కి (Covid-19) వ్యతిరేకంగా ఆమోదించబడిన ఏకైక చికిత్స గా రెమి‌డెసివిర్‌ ఉంది. ఇదిలా ఉంటే భారతదేశంలో, రిమిడెవిర్ సరఫరాను పెంచడానికి అనేక ఫార్మా సంస్థలతో గిలియడ్ నాన్-ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ (Oxford University) తయారు చేస్తున్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఆస్ట్రాజెనికా వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి అందుబాటులోకి వస్తుందని వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనావాలా తెలిపారు. ఆరోగ్య రంగ సిబ్బందికి, వృద్ధులకి ఫిబ్రవరి నాటికే వ్యాక్సిన్‌ని ఇచ్చే అవకాశాలున్నాయని చెప్పారు.

కోవిడ్‌-19 వ్యాక్సిన్ ధర రూ.1000, ప్రకటించిన సీరం ఇన్‌‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా, 2021 ఏప్రిల్ నుంచి సాధారణ ప్రజలకు అందుబాటులోకి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Junior Donald Trump) కుటుంబాన్ని కరోనా వైరస్‌ వదలడం లేదు. అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌ దంపతులు కోవిడ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్‌ పెద్ద కుమారుడు జూనియర్‌ ట్రంప్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన తన క్యాబిన్‌లోనే హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘జూనియర్‌ ట్రంప్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. ప్రస్తుతం ఆయన కోవిడ్‌-19 మెడికల్‌ గైడ్‌లైన్స్‌ని పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఉన్నారు’ అని తెలిపాడు. జూనియర్‌ ట్రంప్‌ కరోనా బారిన పడటంతో ట్రంప్‌ దంపతులతో పాటు వారి చిన్న కుమారుడు బారన్‌, ఇతర సిబ్బందికి పరీక్షలు నిర్వహించనున్నారు.