Nipah Virus: కేర‌ళ‌లో విజృంభిస్తున్న నిఫా వైర‌స్, 14 ఏళ్ల బాలుడి మృతితో కేంద్రం అల‌ర్ట్, ప్ర‌త్యేక బృందాన్ని పంపిన ఆరోగ్య‌శాఖ‌

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాన్ని పంపనున్నది

Nipah Virus (Photo-PTI)

Malappuram, July 21: కేరళ మలప్పురం జిల్లాకు చెందిన 14 సంవత్సరాల బాలుడు నిపా వైరస్‌తో (Nipah Virus) ప్రాణాలు కోల్పోయాడు (Nipah Death). ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాన్ని పంపనున్నది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 14 సంవత్సరాల బాలుడు అక్యూట్ ఎన్‌సెఫాలిటిస్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడని, కోజికోడ్‌లోని ఉన్నత ఆరోగ్య కేంద్రానికి తరలించే ముందు పెరింతల్‌మన్నలోని ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందజేసినట్లు పేర్కొన్నారు. బాలుడి నమూనాలను పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపగా.. పరీక్షల్లో నిపా వైరస్‌ నిర్ధారణ అయ్యిందని పేర్కొంది.

Police Attack On Bus Driver: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన, బస్సుకు బండి అడ్డంగా పెట్టి డ్రైవర్ పై దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్‌  

ఈ వైరస్‌ గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందుతుందని.. గబ్బిలాలు తిన్న కలుషిత పండ్లను అనుకోకుండా మనుషులు తిన్న సమయంలో వైరస్‌ సోకే అవకాశం ఉంటుందని పేర్కొంది. నిపా వైరస్‌ ఇంతకు ముందు కేరళలో నమోదైందని.. చివరి కేసు 2023లో కోజికోడ్‌ జిల్లాలోనే గుర్తించినట్లు పేర్కొంది. ఈ విషయంపై గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతూ కొన్నేళ్ల కిందట కేరళలో నిపా వైరస్‌ వ్యాప్తి చెందిందని.. ఆ తర్వాత వెంటనే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు, వైద్య సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తారని ఆశిస్తున్నానన్నారు. బాలుడి కుటుంబం, కేసు నమోదైన పరిసర ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులను వెంటనే గుర్తించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

Uttar Pradesh: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, తప్పిన పెను ప్రమాదం,నిర్లక్ష్యమే కారణమా?.. వీడియో వైరల్ 

గత 12 రోజుల్లో బాలుడి కాంటాక్టులను (Nipah Cases) గుర్తించడం ప్రారంభించాలని.. వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించాలని.. అనుమానిత వ్యక్తులను గుర్తించాలని సూచించింది. ‘వన్‌ హెల్త్‌’ మిషన్‌ కింద జాయింట్‌ అవుట్‌బ్రేక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఎపిడెమియోలాజికల్‌ లింక్స్‌ను గుర్తించేందుకు, సాంకేతిక సహాయాన్ని అందించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) మోనోక్లోనల్ యాంటీబాడీలను పంపిందని తెలిపింది. బాలుడి పరిస్థితి కారణంగా ఉపయోగించలేమని.. బాలుడి కాంటాక్ట్‌ల నుంచి నమూనాలను సేకరించి.. పరిశీలించేందుకు మొబైల్‌ బీఎస్‌ఎల్‌-3 ప్రయోగశాల కోజికోడ్‌ చేరుకుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.