FM Nirmala Sitharaman PC: చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల కేటాయింపు, నగదు లభ్యత పెంచడమే ప్యాకేజీ లక్ష్యం, ఉద్దీపన చర్యల్లో భాగంగా 15 సహాయక చర్యలు
20 Lakh Crore) పూర్తి వివరాలను వెల్లడించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman on Economic Package) ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
New Delhi, May 13: ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై (Rs. 20 Lakh Crore) పూర్తి వివరాలను వెల్లడించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman on Economic Package) ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజి, ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం చేయాల్సిందే, భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం నమ్ముతోంది, జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
అన్ని వర్గాల ప్రజలతో చర్చించిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. స్వీయ ఆధారిత భారతం పేరుతో ప్రధాని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ ఐదు మూల సూత్రాల ఆధారంగా ప్రధాని ప్రకటన చేశారన్నారు.
చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 3 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. MSME రంగాలకు ఆరు సహాయక చర్యలను ప్రకటించారు. ఈ రుణాలకు నాలుగేళ్ల కాలపరిమితి, మారటోరియం ఉంటుందని తెలిపారు. MSME రుణాలకు కేంద్రం గ్యారంటీ ఇస్తుందన్నారు. ఈ ప్యాకేజీ రెండు లక్షల చిన్న, మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. నగదు లభ్యత పెంచడమే మా ఉద్దేశమన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ, సర్కార్ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి, 21వ శతాబ్దం భారత్‌దేనని తెలిపిన ప్రధాని మోదీ
దేశ ఆర్థికవృద్ధిని పెంచి స్వయం ఆధారిత భారత్ లక్ష్యంగా ప్యాకేజీని ప్రకటించారన్నారు. ఆత్మ నిర్భర భారత్‌కు ఐదు అంశాలను మూల స్తంభాలుగా పేర్కొన్నారు. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్ సూత్రాలు ఆత్మ నిర్భర భారత్‌కు మూల స్తంభాలుగా చెప్పారు. భూమి, నగదు లభ్యత, పాలనాపరమైన విధానాలే కీలకం అన్నారు. స్థానిక బ్రాండ్లకు అంతర్జాతీయ స్థాయి కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
గత 40 రోజుల్లో మన శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు. భారత్ స్వయంపూర్వకంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రధాని ఒక సమగ్రమైన దార్శనికతను దేశం ముందుంచారన్నారు. వివిధ స్థాయిల్లో సంప్రదించాకే ప్రధాని ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. పీపీఈ కిట్లు, మాస్క్‌ల తయారీలో ఎంతో ప్రగతి సాధించామన్నారు. గడిచిన ఐదేళ్లలో ఎన్నో విధాలైన సంస్కరణలు అమలు చేసినట్లు చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ తమ ప్రభుత్వ సంస్కరణలకు మేలిమి ఉదాహరణ అన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం విదితమే. అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఆ ప్యాకేజీకి అనుగుణంగా డబ్బును రానున్న రోజుల్లో ఎలా ఖర్చు పెట్టేది.. ఆమె వివరించారు. ఎక్కువగా పేద, మధ్య తరగతి వర్గాలు, రైతులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారికే ఈ ప్యాకేజీలో పెద్ద పీట వేశారు.