Nithin Gadkari On Cashless Treatment: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స, పైలట్ ప్రాజెక్టుగా ఆ రెండు రాష్ట్రాల్లో అమలు,నితిన్ గడ్కరీ కీలక ప్రకటన

మోటారు వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారి కోసం నగదు రహిత చికిత్స అందించేందుకు ఈ కొత్త పథకాన్ని రూపొందించామన్నారు. ప్రయోగాత్మకంగా అస్సాం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

Nithin Gadkari says cashless treatment scheme for road crash victims

Delhi, Aug 2: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను అందిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మోటారు వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారి కోసం నగదు రహిత చికిత్స అందించేందుకు ఈ కొత్త పథకాన్ని రూపొందించామన్నారు. ప్రయోగాత్మకంగా అస్సాం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి-జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద క్షతగాత్రులు నిర్దేశిత ఆస్పత్రుల్లో ప్రమాదం జరిగిన తేదీ నుంచి వారం రోజుల పాటు గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. తొలుత రెండు రాష్ట్రాల్లో ఆ తర్వాత దేశమంతా విస్తరిస్తామని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి ప్రాణాలను కాపాడేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుందని తెలిపారు. ప్రపంచంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ అగ్రస్‌థానంలో ఉంది.

నగదు రహిత చికిత్సకు అయ్యే ఖర్చును మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 164 బి కింద మోటారు వాహన ప్రమాద నిధి అందిస్తుంందని వెల్లడించారు. స్థానిక పోలీసులు, ఆసుపత్రులు, ఆరోగ్య సంస్థలు, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తో సహా వివిధ శాఖలు భాగస్వాములుగా ఉంటాయని వెల్లడించారు. 2030 నాటికి రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు గడ్కరీ.

Here's Tweet:



సంబంధిత వార్తలు

Patnam Narender Reddy: కలెక్టర్ పై దాడి కేసులో A1గా పట్నం నరేందర్ రెడ్డి, కస్టడీపై పిటిషన్‌పై ఇవాళ కోర్టులో వాదనలు, కలెక్టర్‌పై దాడి బయటివారి పనేనని పోలీసుల వెల్లడి

KTR on AMRUT Tender Scam: రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్రం విచారణ జరిపించాలి, అమృత్‌ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని తెలిపిన కేటీఆర్

Hyderabad: హెల్మెట్ ధరించకుండా రోడ్డు మీదకు బైకుతో వెళితే జేబులు గుల్లే, నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

Uttar Pradesh: వీడియో ఇదిగో, దేవాలయంలో ఏసీ నుంచి కారుతున్న నీటిని తాగేందుకు ఎగబడుతున్న భక్తులు, కోరి కోరి రోగాలు తెచ్చుకోవద్దంటున్న వైద్యులు