Rs 2,000 Bank Notes: రూ.2 వేల నోటు రద్దుపై స్పష్టత, ఈ నోట్ల ముద్రణ నిలిపివేతపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, లోక్‌సభలో వెల్లడించిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్
ఆర్ బిఐ రూ. 2 వేల నోటు ప్రింటింగ్ ఆపేస్తుందనే రూమర్లు కూడా వచ్చాయి. దీనిపై కేంద్రం (Central Govt) పార్లమెంట్ వేదికగా స్పష్టతనిచ్చింది. రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది.
New Delhi, Mar 17: గత కొంతకాలంగా రెండు వేల రూపాయల నోటు (Rs 2,000 Bank Note) బ్యాన్ అవుతోందని సోషల్ మీడియాలో (Social Media) వార్తలు వస్తున్నాయి. ఆర్ బిఐ రూ. 2 వేల నోటు ప్రింటింగ్ ఆపేస్తుందనే రూమర్లు కూడా వచ్చాయి. దీనిపై కేంద్రం (Central Govt) పార్లమెంట్ వేదికగా స్పష్టతనిచ్చింది. రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది.
రూ.2 వేల నోటు రద్దు వదంతులను నమ్మవద్దంటున్న ఆర్‌బిఐ
ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ (MoS Finance Anurag Thakur) సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రూ.2 వేల నోట్ల ముద్రణ ఆపే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని ఆయన వివరించారు. రూ.2 వేల నోట్లకు చిల్లర కొరతతో వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. దీంతో, రూ.500, రూ.200 నోట్లుంచేందుకు ఏటీఎంలను సిద్ధం చేయాలని ఎస్‌బీఐ, ఇండియన్ బ్యాంక్ తమ అధికారులను ఆదేశించాయని వివరించారు.
ప్రభుత్వరంగంలోని ఎస్‌బీఐ, ఇండియన్ బ్యాంక్ లు రూ.500 నోట్లు, రూ.200 నోట్లు ఏటీఎంలో వచ్చేలా ఏటీఎంలలో కొన్ని మార్పులు తెస్తున్నాయని ఆయన వివరించారు. దేశంలో రూ.500, రూ.200 నోట్లకు డిమాండ్ బాగా పెరిగిందని అన్నారు.అదే సందర్భంలో రూ.2000 నోట్లను మార్పిడి చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నమాట వాస్తవమే అని ఆయన వ్యాఖ్యానించారు.
రూ.2 వేల నోటు కదిలిస్తే రంగులు మారిపోతాయి
అందుకే తాము ఆ నోట్ల బదులుగా, ఎక్కువ సంఖ్యలో రూ.500, రూ.200 నోట్లు ఏటీఎంలలో వచ్చేలా చేస్తున్నామని ఆయన వివరించారు. పూర్తిగా రూ.2000 నోట్లు రావని కాదని చెప్పారు. తక్కువ సంఖ్యలో వస్తాయని అన్నారు. ఇప్పటివరకు 7.40 లక్షల కోట్ల విలువైన రూ.2000 కరెన్సీని ముద్రించామని చెప్పారు.