New Delhi, December 8: ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) షాకిచ్చిందని ఆ మెసేజ్ (viral message ) సారాంశం. వచ్చే ఏడాది జనవరి నుంచి రూ. 2 వేల నోట్లు (Rs 200 Notes) కనిపించవని వాటి స్థానంలో ఆర్‌బిఐ (RBI) వెయ్యి రూపాయల నోటును తీసుకువస్తోందని..ఇది న్యూ ఇయర్ వార్నింగ్ అంటూ చాలామంది ఓ వాట్సప్ మెసేజ్ ని షేర్ చేస్తున్నారు.
అయితే ఇదంతా ఫేక్ (Fake Message)అని ఆర్‌బిఐ కొట్టిపారేసింది. ఇటువంటి వదంతులు నమ్మవద్దని కోరింది. పాత నోట్లన్నీ 2019 డిసెంబరు 31వరకే చెల్లుబాటు అవుతాయని వాటిని త్వరగా మార్చేసుకోవాలి. పైగా ఒక వ్యక్తి రూ.50వేలు మాత్రమే నగదు బదిలీ చేసుకోగలడు' అని ఆ వాట్సప్ మెసేజ్ లో ఉంది. ఈ మెసేజ్ లో నిజం ఏ మాత్రం లేదని ఇదంతా ఫేక్ అని అధికారులు కొట్టిపారేశారు. ఆర్బీఐ రూ.2వేల నోట్లను రద్దు చేసే ఆలోచనే ఏదీ చేయలేదని తెలిపారు.
ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Singh Thakur) రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఇలా సమధానమిచ్చారు. రూ.2వేల నోట్లను అక్టోబరు నుంచి రద్దు చేస్తామనడంలో వాస్తవం లేదు. 'ఇవన్నీ రూమర్లు మాత్రమే. అలాంటి నోటిఫికేషన్ ఆర్బీఐ చేయలేదు. ఇంకా వివరాలు కావాలంటే ఆర్బీఐ సైట్‌లో చూడండి' అని వివరించింది.
కాగా 2016లోనూ సంవత్సరం నవంబరు నెలలో కేంద్ర ప్రభుత్వం పాత నోట్లను రద్దు చేసి సంచలనానికి తెరలేపింది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ లు చక్కర్లు కొడుతున్నాయి.