
New Delhi, Jan 2: 2016లో కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. నోట్ల రద్దు (2016 demonetisation decision) నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. 2016 నవంబర్ 8వ తేదీన కేంద్రం ఇచ్చిన నోట్ల రద్దు నోటిఫికేషన్ సరైందనేనని బెంచ్ స్పష్టం చేసింది. నేడు సుప్రీం ధర్మాసనం నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మొత్తం 58 పిటిషన్లపై విచారణ చేపట్టింది .
జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, బీఆర్ గవాయ్, ఏఎస్ బొప్పన్నా, వీ రామసుబ్రమణియన్, బీవీ నాగరత్న నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆర్థిక విధాన అమలు నిర్ణయాన్ని(demonetisation decision) వెనక్కి తీసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. నోట్ల రద్దుపై కేంద్రం, ఆర్బీఐ సంప్రదింపులు జరిగాయి. అటువంటి చర్యను తీసుకురావడానికి సహేతుకమైన కారణం ఉంది. దామాషా సిద్ధాంతం వల్ల పెద్ద నోట్ల రద్దు జరగలేదని మేము భావిస్తున్నాము అని ధర్మాసనం అభిప్రాయపడింది.
అయితే జస్టిస్ గవాయి వెల్లడించిన తీర్పుతో బెంచ్‌లోని జస్టిస్ నాగర్నత ఒక్కరే విభేధించడం గమనార్హం.2016లో వెయ్యి, 500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.