'Nobody Can Take Our Land': చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా, భారత్‌ భూభాగంలో ఒక్క ఇంచు కూడా తీసుకోలేరంటూ కౌంటర్, వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాం ప్రారంభించిన హోం మంత్రి

అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి చెందిన ఇంచు (Pin's tip Worth) భూభాగాన్ని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని, దేశంపై చెడు దృష్టి సారించే సాహసం కూడా ఎవరూ చేయలేరని చైనాను ఉద్దేశించి అమిత్‌షా (Amit Shah) అన్నారు.

Amit Shah in Arunachal (Photo-ANI)

New Delhi, April 10: అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి చెందిన సూదిమొనంత (Pin's tip Worth) భూభాగాన్ని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని, దేశంపై చెడు దృష్టి సారించే సాహసం కూడా ఎవరూ చేయలేరని చైనాను ఉద్దేశించి అమిత్‌షా (Amit Shah) అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని కిబితూ (kibithoo)లో ''వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాం'' (VVP)ను సోమవారంనాడు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరిహద్దులను ఇండో-టిబిటన్ సరిహద్దు పోలీసులు, భారత ఆర్మీ కంటికిరెప్పలా చూసుకుంటున్నాయని, ఈ పరిస్థితిల్లో భారత్‌పై చెడుకన్ను వేసే సాహసం ఎవరూ చేయలేరని (Nobody Can Take Our Land) అన్నారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను ఎవరూ ప్రశ్నించలేరని, భారత్‌ భూభాగంలో ఒక్క అంగుళం కూడా ఎవరూ తీసుకోలేరరన్నారు.

అమిత్ షా అరుణాచల్ పర్యటన, మా భూభాగంలోకి ఎందుకు వస్తున్నారంటూ మండిపడిన చైనా

దేశ ప్రజలందరూ ఇవాళ ప్రశాంతంగా ఇళ్లలో నిద్రిస్తున్నారంటే అందుకు మన సరిహద్దుల్లో రేయింబవళ్లు పహారా కాస్తున్న మన ఐటీబీపీ జవాన్లు, ఆర్మీనే కారణం. దుష్టపన్నాగంతో మన భూభాగంపై కన్నేసే సాహసం ఎవరూ చేయలేరు. ఈ విషయాన్ని మనం ఇవాళ చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. జవాన్ల త్యాగాలకు నేను సెల్యూట్ చేస్తున్నారు. 1962లో ఇక్కడ భూమిని ఆక్రమించుకునేందుకు వచ్చిన వారెవరైతే ఉన్నారో వారు ఇవాళ మీ దేశభక్తి కారణంగా వెనక్కి వెళ్లిపోయారు'' అని చైనాను పరోక్షంగా ఉద్దేశించి అమిత్‌షా అన్నారు.

Here's HM Speech

మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ''లుక్ ఈస్ట్ పాలసీ''తో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయని, ఇప్పుడు ఆ ప్రాంతాలు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నాయని హోం మంత్రి అన్నారు. 2014కు ముందు ఈశాన్య ప్రాంతమంతా కల్లోపిత ప్రాంతంగా ఉండేదని, గత 9 ఏళ్లలో మోదీ తీసుకువచ్చిన లూక్ ఈస్ట్ పాలసీతో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతోందని చెప్పారు.

వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంలో కిబితూ మొదటి గ్రామమని ఆయన అభివర్ణించారు. ఇది చిట్టచివరి గ్రామం ఎంతమాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. గతంలో తాను ఇక్కడికి వచ్చినప్పుడు దేశంలోని చివరి గ్రామాన్ని దర్శిస్తు్న్నారని తనతో అనేవారని, అయితే ఇవాళ తాను ఒక విషయం చెప్పదలచుకున్నానని, కిబితూ ఎంతమాత్రం చివరి గ్రామం కాదని, మొదటి గ్రామమని అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో 11 ప్రదేశాల పేర్లు మార్చిన చైనా, అది మా భూభాగమంటూ మండిపడిన భారత్, మద్దతుగా నిలబడిన అమెరికా

2022-23 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు రూ.4,800 ఆర్థిక కేటాయింపులతో కేంద్ర ప్రాయోజిత పథకమైన “వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్” (VVP)కు మోదీ సారథ్యంలోని కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు. గుర్తించబడిన సరిహద్దు గ్రామాలలో నివసించే ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం, ఉత్తర సరిహద్దులోని బ్లాకుల గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ఈ పథకం లక్ష్యమని చెప్పారు. తొలి విడతగా 662 గ్రామాలను గుర్తించామని, అందులో 455 గ్రామాలు అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్నాయని తెలిపారు.

కాగా భారత్‌ అంతర్గత విషయంలో డ్రాగన్‌ కంట్రీ చైనా మరోసారి తలదూర్చిన సంగతి విదితమే. ఈసారి ఏకంగా కేంద్రహోం మంత్రి అమిత్‌ షా పర్యటనపై అక్కస్సు వెళ్లగక్కింది. ఆ ప్రాంతం చైనాకు చెందినది అని.. అక్కడ అమిత్‌ షా పర్యటించకూడదు అంటూ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో చైనాకు అమిత్‌ షా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. గత వారం చైనా కవ్వింపు చర్యలకు పాల్పడింది. అరుణాచల్‌లోని పలు ప్రాంతాలు తమ దేశానికి చెందినవి అంటూ వాటి పేర్లను మార్చింది. దక్షిణ టిబెట్‌గా చెప్పుకునే అరుణాచల్ ప్రదేశ్‌లోని మరో 11 ప్రదేశాలకు.. చైనా పేర్లను బీజింగ్ ప్రకటించింది. దీన్ని భారత్‌ తీవ్రంగా తప్పుబట్టింది. చైనా పేర్లు పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. చైనా ఇటువంటి ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు. చైనా కవ్వింపులను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now