Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో షాక్, పిటీషన్ ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన కోర్టు
రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఆయన సవాల్ చేశారు. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. అరెస్టు చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు (Delhi Highcourt) నిరాకరించింది
New Delhi, March 23: మద్యం పాలసీ ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఆయన సవాల్ చేశారు. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. అరెస్టు చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు (Delhi Highcourt) నిరాకరించింది. విచారణకు కోసం బుధవారం వరకు ఆగాలని సూచించింది. మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఈడీ అధికారులు అరెస్టు చేశారు. రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు మార్చి 28 వరకు ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది.
మద్యం పాలసీ స్కామ్‌లో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ కోర్టులో ఆరోపించింది. మద్యం పాలసీ రూపకల్పనలో ప్రత్యక్షంగా పాలు పంచుకున్నారని.. కేజ్రీవాల్ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని.. ఈ డబ్బును గోవా ఎన్నికల్లో ఉపయోగించారని ఈడీ కోర్టుకు తెలిపింది. హోలీ పండుగ నేపథ్యంలో ఈ నెల 26 వరకు కోర్టుకు సెలవులు ఉండనున్నాయి. ఈ క్రమంలో బుధవారం పిటిషన్‌ను విచారించే అవకాశం ఉన్నది.