Nobel Prize in Medicine 2024: విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌కు నోబెల్, మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్ ట్రాన్‌స్ర్కిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా పురస్కారం
కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో విజేతను ప్రకటించారు. 2024 సంవత్సరానికి మెడిసిన్‌లో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
స్వీడెన్‌లోని స్టాక్‌హోమ్‌లో మెడిసిన్‌లో ఇవాళ నోబెల్ బహుమతి ప్రకటించారు. కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో విజేతను ప్రకటించారు. 2024 సంవత్సరానికి మెడిసిన్‌లో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. జీన్ రెగ్యులేషన్‌లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్రను విశ్లేషించినందుకు ఆ ఇద్దరికి అవార్డును ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనం.. 20 వేల మందికి పైగా ఆవాసం.. చైనాలో భవంతి.. వీడియో ఇదిగో..!
బహుకణ జీవుల్లో గడిచిన 500 మిలియన్ల ఏళ్లలో మైక్రోఆర్ఎన్ఏ ఎంతో రూపాంతంరం చెందినదని శాస్త్రవేత్తలు నిరూపించారు. మనుషుల్లో ఉండే మైక్రోఆర్ఎన్ఏల్లో.. వేల సంఖ్యలో జనువులు ఉన్నాయని, అయితే జన్యువులను మైక్రోఆర్ఎన్ఏ రెగ్యులేట్ చేస్తున్నదని పేర్కొన్న శాస్త్రవేత్తలకు ఈ అవార్డును ప్రకటించారు. మనుషుల్లో ఉండే మైక్రోఆర్ఎన్ఏ.. బహుకణ జీవుల్లోని ఆర్ఎన్ఏ ఒకే విధంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Here's News
వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2024), అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.
స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.