Newdelhi, Oct 7: ఒక భవనంలో ఎంత మంది ఉంటారు? అపార్ట్ మెంట్ అయితే, మహా అయితే, ఓ వంద, రెండొందల మంది ఉంటారు. అంతేగా.. అయితే, ఓ భవనంలో ఏకంగా 20 వేల మందికి పైగా నివాసం ఉంటున్నారు. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనంగా ఇది నిలిచింది. చైనాలోని (China) కియాన్ జియాంగ్ సెంచరీ సిటీలో ఈ అద్భుతమైన భవనం ఉంది. పేరు 'రీజెంట్ ఇంటర్నేషనల్' (Regent International). ఈ ఆకాశ హర్మ్యాన్ని మొదట్లో హై-ఎండ్ హోటల్ గా వినియోగించారట. కానీ ఆ తరువాత విస్తారమైన అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ గా మార్చారు.
Here's Video:
🚨 More than 20,000 people are living in this world's biggest residential building in China. pic.twitter.com/O3nBToayx4
— Indian Tech & Infra (@IndianTechGuide) October 6, 2024
సకల సౌకర్యాలు
'ఎస్' ఆకారంలో ఉండే రీజెంట్ ఇంటర్నేషనల్ 1.47 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమై ఉంది. ఈ భారీ నిర్మాణం అనేక సౌకర్యాలు, వసతులను కలిగి ఉండడం మరో విశేషం. ఇందులోని నివాసితులు తమ రోజువారీ అవసరాల కోసం ఎప్పుడూ భవంతి ప్రాంగణాన్ని దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కాంప్లెక్స్ లో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, వినోద కార్యక్రమాల కోసం నిర్మాణాలతో పాటు అత్యాధునిక ఫిట్ నెస్ సెంటర్ లు, ఫుడ్ కోర్ట్ లు, ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్, కిరాణా దుకాణాలు, బార్బర్ షాపులు, విస్తారమైన గార్డెన్ లు కూడా ఈ భవంతిలోనే ఉన్నాయి.
ప్రత్యేకతలు ఇలా..
- పేరు: రీజెంట్ ఇంటర్నేషనల్
- ప్రారంభం: 2013
- ప్రాంతం: కియాన్ జియాంగ్ సెంచరీ సిటీ, చైనా
- ఎత్తు: 675 అడుగులు
- విస్తీర్ణం: 1.47 మిలియన్ చదరపు మీటర్లు
- అంతస్తులు: 39
- సామర్థ్యం: 30 వేల మంది
- ప్రస్తుత నివాసం: 20 వేల మంది
- అద్దె: రూ. 18 వేల నుంచి రూ. 50వేల వరకు