Manipur Violence: నివురుగప్పిన నిప్పులా మారిన మణిపూర్, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, హోం మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం

జాతుల మధ్య వైరంతో గతేదాడి నుంచి అక్కడ కల్లోల పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులను బందీలుగా పట్టుకుపోయారు.

Violence in Manipur (Image Credits - Twitter/@MangteC)

ఇంఫాల్‌, నవంబర్‌ 17: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటున్నాయి. జాతుల మధ్య వైరంతో గతేదాడి నుంచి అక్కడ కల్లోల పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులను బందీలుగా పట్టుకుపోయారు. ఆరుగురు మైతీలు మృతదేహాలుగా నదిలో తేలడంతో మణిపూర్‌లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

ఆగ్రహంతో ఉన్న బాధితులు నవంబర్ 16న మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు, ఆస్తులపై దాడి చేశాయి. ఒక మూక తీవ్ర ఆగ్రహంతో ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌, మంత్రులు సపం రంజన్‌, ఎల్‌ సుసీంద్రో సింగ్‌, వై కఖేంచంద్‌లతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సపమ్‌ కుంజాకెసోర్‌, జోయ్‌కిషన్‌ సింగ్‌, మరికొందరి ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేశారు. ఎమ్మెల్యేల వాహనాలను కాల్చివేశారు. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. నిరవధికంగా కర్ఫ్యూ విధించారు.

వీడియో ఇదిగో, బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఆప్ నేత కైలాశ్‌ గహ్లోత్‌, ఈడీ, సీబీఐ కేసుల నుంచి రక్షణ కోసమే మోదీ చెంత చేరారని ఆమ్ ఆద్మీ మండిపాటు

మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) ఆదివారం బీజేపీ నేతృత్వంలోని బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది. ఈ పరిణామంతో ఎన్డీఏ కూటమి బలం అసెంబ్లీలో 53 నుంచి 46కు పడిపోయింది. బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 37 కాగా, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్)కు ఐదుగురు, జేడీయూ నుంచి ఒకరు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది.

మణిపూర్ అల్లర్లు..బీజేపీకి షాక్, మద్దతు ఉపసంహరించుకున్న నేషనల్ పీపుల్స్ పార్టీ, బీజేపీ చీఫ్‌కు లేఖ రాసిన మేఘాల‌యా సీఎం కాన్రాడ్‌ కె.సంగ్మా

60 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం విపక్షాలకు ఏడు సీట్లు మాత్రమే ఉన్నాయి. అందులో కాంగ్రెస్‌కు 5, కుకీ పీపుల్స్‌ అలయెన్స్‌కు 2 ఉన్నాయి. బీజేపీకి ప్రస్తుతం 37 స్థానాలు ఉండగా, అందులో 19 మంది సభ్యులు పార్టీ అసమ్మతివాదులుగా ఉన్నారు. వారు బీరేన్‌ సింగ్‌ను నిశితంగా విమర్శిస్తున్నారు. బీరేన్‌ సింగ్‌ కు గరిష్ఠంగా 20 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉందని, ఆయన పదవికి ప్రమాదం పొంచి ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక అంతకుముందు కుకీ పీపుల్స్ పార్టీ (KPA) కుల హింసను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర NDA ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.

మణిపూర్ ఒక సంవత్సరానికి పైగా జాతి వివాదంతో పోరాడుతోంది. మణిపూర్‌లోని మెజారిటీ మెయిటీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలనే డిమాండ్‌కు నిరసనగా మణిపూర్‌లోని హిల్ జిల్లాల్లో గిరిజన ఐక్యత మార్చ్‌ను చేపట్టిన తర్వాత గత ఏడాది మే 3న కుల హింస చెలరేగింది. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాకాండలో కుకీ, మెయిటీ కమ్యూనిటీలకు చెందిన 220 మందికి పైగా ప్రజలు, భద్రతా సిబ్బంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

ఉద్దేశపూర్వకంగానే అధికార బీజేపీ మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులకు ఆజ్యం పోస్తున్నదని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.నవంబర్‌ 7 నుంచి అక్కడ 17 మంది మరణించారని, ఇప్పుడు హింస కొన్ని కొత్త జిల్లాలకు కూడా వ్యాపించిందని, తర్వాత అది మిగిలిన ఈశాన్య రాష్ర్టాలకు కూడా పాకే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మణిపూర్‌లో హింసపై కేంద్ర మంత్రి అమిత్‌ షా ఢిల్లీలో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రంలో శాంతిభద్రతలకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలో నిర్వహించాల్సిన సభలను ఆయన రద్దు చేసుకున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif