Kailash Gehlot Joins BJP: వీడియో ఇదిగో, బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఆప్ నేత కైలాశ్ గహ్లోత్, ఈడీ, సీబీఐ కేసుల నుంచి రక్షణ కోసమే మోదీ చెంత చేరారని ఆమ్ ఆద్మీ మండిపాటు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్‌ఆద్మీ పార్టీ (APP)కి భారీ షాక్ తగిలింది. ఆప్‌లో కీలక నేతగా వ్యవహరించిన కైలాశ్ గహ్లోత్ (Kailash Gahlot) నేడు బీజేపీలో చేరారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన గహ్లోత్ ఆదివారం ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు లేఖ పంపిన విషయం తెలిసిందే.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్‌ఆద్మీ పార్టీ (APP)కి భారీ షాక్ తగిలింది. ఆప్‌లో కీలక నేతగా వ్యవహరించిన కైలాశ్ గహ్లోత్ (Kailash Gahlot) నేడు బీజేపీలో చేరారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన గహ్లోత్ ఆదివారం ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు లేఖ పంపిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం అసంపూర్తి హామీలు ఇస్తోందని.. పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని కైలాశ్ గహ్లోత్ తాను రాసిన లేఖలో ఆరోపించారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధతతో ఏర్పడిన ఆప్ ఆశయాలను ఆ పార్టీ నేతల రాజకీయ ఆశయాలు అధిగమించాయని మండిపడ్డారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పార్టీ సొంత రాజకీయ అజెండా కోసం పాకులాడుతున్నదని గెహ్లాట్ ఆరోపించారు. అయితే గెహ్లాట్ ప్రస్తుతం ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నారని, ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం తప్ప ఆయనకు మరో అవకాశం లేదని ఆప్ నేతలు వ్యాఖ్యానించారు.
Kailash Gehlot Joins BJP:
#WATCH | Delhi: Former Delhi Minister and AAP leader Kailash Gahlot joins BJP, in the presence of Union Minister Manohar Lal Khattar and other BJP leaders. pic.twitter.com/l2Ol8Umxe1
— ANI (@ANI) November 18, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 18, 2024 01:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

