Big Shock to Kejriwal, Delhi Minister Kailash Gahlot Resigns Aam Aadmi Party(X).jpg

Delhi, Nov 17: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, మంత్రి కైలాష్ గెహ్లాట్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు గల కారణాలను లేఖలో ప్రస్తావించారు కైలాష్ గెహ్లాట్. కేంద్ర ప్రభుత్వంతో పోరాడేందుకే ఢిల్లీ ప్రభుత్వం ఎక్కువ సమయం కేటాయించిందని, ఈ క్రమంలో ఢిల్లీ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు.ఢిల్లీ ప్రజలు కనీస సేవలు కూడా అందక ఇబ్బందులు పడుతున్నారు అని ఆరోపించారు.

ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధతతో నా రాజకీయ ప్రయాణం ప్రారంభించాను అని చెప్పారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే ఆప్‌కు రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని లేఖలో పేర్కొన్నారు.  మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో తెలుగు గుభాళింపులు, మూడు రోజుల పాటూ చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి స‌హా అనేక ముఖ్య‌నేత‌ల ప్ర‌చారం

Here's Tweet:

ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుందని తెలిపారు కైలాష్. ఆప్ ఇచ్చిన అనేక వాగ్ధానాలు నెరవేరలేదు అన్నారు. ఉదారహరణకు.. మనం యమునా నదిని స్వచ్ఛమైన నదిగా చేస్తామని వాగ్దానం చేశాము. కానీ, మనం అలా చేయలేకపోయాము అన్నారు. ఇప్పుడు యమునా నది గతంలో కంటే కలుషితమైందని.... మరో బాధాకరమైన విషయం ఏమిటంటే.. ప్రజల హక్కుల కోసం పోరాడకుండా కేవలం మన రాజకీయ ఎజెండా కోసమే పోరాడుతున్నాం అని చెప్పారు.