ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లను కలిశారు. ఏపీకి చెందిన పలు అంశాలపై వారితో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలు, అమరావతి, పోలవరం తదితర అంశాలపై కేంద్రమంత్రులతో మాట్లాడారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు సీఎం రమేశ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
CM Chandrababu Meets Amit Shah:
ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు.#CBNInDelhi#ChandrababuNaidu pic.twitter.com/fE9Gg1yIEi
— Telugu Desam Party (@JaiTDP) March 5, 2025
ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ గారితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కీలక అంశాలపై చర్చించారు.#CBNInDelhi#ChandrababuNaidu pic.twitter.com/MjQkHs4JgD
— Telugu Desam Party (@JaiTDP) March 5, 2025
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గారితో సమావేశమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. పాల్గొన్న కూటమి ఎంపీలు. పెండింగ్ ప్రాజెక్టులు, ఏపీకి కావలసిన నిధులపై ఈ సమావేశంలో చర్చించారు.#CBNInDelhi#ChandrababuNaidu pic.twitter.com/7ITeFzmW62
— Telugu Desam Party (@JaiTDP) March 5, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)