ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీక పర్యటనలో భాగంగా దేశ రాజధానికి చేరుకున్నారు. ఢిల్లీలో ఓ శుభకార్యానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. తిరిగి రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి సీఎం చంద్రబాబు రానున్నారు. 6వ తేదీ ఉదయం 10.30 గంటలకు గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు.అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 4 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా కొణిదెల నాగబాబు ఖరారు, కీలక ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ

5.30 గంటలకు భారత్ మండపంలో జరిగే రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌లో పాల్గొంటారు. 6వ తేదీ రాత్రి ఢిల్లీలోనే బస చేసి 7వ తేదీ ఉదయం బయలుదేరి అమరావతికి వస్తారు. సీఎం చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం ఈ నెల 7వ తేదీన జరుగనుంది. ఏపీ సచివాలయం మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌ హాల్‌లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ భేటీ జరుగనుంది.

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu arrives in Delhi.

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)