Odisha Coronavirus: కరోనా పోరులో వైద్య సిబ్బంది మరణిస్తే రూ.50 లక్షలు, కీలక నిర్ణయం తీసుకున్న నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం, చనిపోయిన వైద్య సిబ్బందికి అమరవీరుల గుర్తింపు హోదా

కోవిడ్‌-19 (COVID-19) పోరులో ముందుండే వైద్య సిబ్బంది, వారి సహాయ సిబ్బంది అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆయా కుటుంబాలకు రూ.50 లక్షలు ఆర్థిక సాయం (Odisha announces Rs 50 lakh) అందివ్వనున్నట్టు మంగళవారం సీఎం పట్నాయక్‌ ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది కుంటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈమేరకు ఆయన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

Odisha announces Rs 50 lakh for kin of health & support staff who die treating Covid-19 (Photo-Facebook)

Bhubaneswar, April 21: కరోనావైరస్ కట్టడికి పటిష్ట చర్యలు చేపడుతున్న నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం (CM Naveen Patnaik) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 (COVID-19) పోరులో ముందుండే వైద్య సిబ్బంది, వారి సహాయ సిబ్బంది అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆయా కుటుంబాలకు రూ.50 లక్షలు ఆర్థిక సాయం (Odisha announces Rs 50 lakh) అందివ్వనున్నట్టు మంగళవారం సీఎం పట్నాయక్‌ ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది కుంటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈమేరకు ఆయన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. సమాజం సిగ్గు పడే ఘటన, కరోనాతో డాక్టర్ మృతి, పాతి పెట్టేందుకు ఒప్పుకోని చెన్నై వాసులు, రహస్యంగా అంత్యక్రియలు చేసిన మరో డాక్టర్, ఇది మా దుస్థితి అంటూ ఆవేదన

అదేవిధంగా ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని అమరలవీరులుగా గౌరవిస్తామని ఆయన చెప్పారు. అమరుల త్యాగాలను గుర్తించి.. వారి కుటుంబ సభ్యులకు అవార్డులు అందించే కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజలంతా ఆరోగ్యసిబ్బంది సేవలపట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని, వారి పట్ల అనుచితం వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 74 కరోనా పాజిటివ్‌ కేసులు (Odisha Coronavirus) నమోదవగా.. 24 మంది కోలుకున్నారు. ఒక్కరు మరణించారు.వైద్య సిబ్బందిని వదలని కరోనా, పుణేలోని రూబీ హాల్‌ క్లినిక్‌‌లో 25 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌, క్వారంటైన్‌కు తరలించి చికిత్స

కరోనావైరస్ రోగులకు చికిత్స చేసే సమయంలో వైద్యులు మరణిస్తే వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఇస్తుందని ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Kejriwal) ప్రకటించిన సంగతి విదితమే. ఆసుపత్రులలో డాక్టర్, నర్సు, పారిశుధ్య కార్మికుడు, ల్యాబ్ టెక్నీషియన్ వ్యాధి భారీన పడి మరణిస్తే ఢిల్లీ ప్రభుత్వం వారి కుటుంబాలకు పరిహారం అందిస్తుందని విలేకర్ల సమావేశంలో తెలిపారు.

నగరంలో మొత్తం 60 పారిశుధ్య యంత్రాలను మోహరించినట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. చాలా ప్రదేశాలు ఇప్పటికే శుభ్రపరచబడ్డాయి" అని ఆయన చెప్పారు. కంట్రీమెంట్ జోన్లలో నివసించేటప్పుడు సామాజిక దూరాన్ని కొనసాగించాలని కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో 71 కంటెమెంట్ జోన్లు ఉన్నాయి. ప్రజలు తమ ఇళ్లలో ఉండాలని మరియు పొరుగువారి ఇంటిని సందర్శించవద్దని నేను అభ్యర్థిస్తున్నాను, ”అని ఢిల్లీ సీఎం అన్నారు.