Coronavirus Outbreak in Italy. (Photo Credits: AFP)

Chennai,April 21: తమిళనాడులో (Tamil Nadu) సమాజం సిగ్గు పడే విధంగా ఘటనలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న నెల్లూరు డాక్టర్ (Nellore Doctor) అంత్యక్రియలను అడ్డుకున్న గ్రామస్థులు నిన్న మరో డాక్టర్ అంత్యక్రియలను అడ్డుకున్నారు. కొవిడ్‌ బాధితులకు చికిత్స చేస్తూ మరణించిన, చెన్నైకు చెందిన ఓ డాక్టర్‌ (Tamil Nadu Doctor) అంత్యక్రియలకు స్థానికులు తీవ్ర అడ్డంకులు కల్పించడమే కాక... వచ్చిన మెడికల్‌ సిబ్బందిపై దాడి చేయడం చెన్నైలో కలకలం రేపింది. కరోనాతో ఏపీలో డాక్టర్ మృతి, నెల్లూరులో తొలి మరణం, అంత్యక్రియలపై వివాదం, వీడియో కాల్ ద్వారా కడసారి చూసుకుని కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు

డాక్టర్‌ సైమన్‌ హెర్క్యులస్‌ (55) అనే న్యూరోసర్జన్‌ గత 20రోజులుగా ఇంటికి కూడా వెళ్లకుండా కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వైరస్ ఆయనకు సోకింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయనకు శ్వాసకోశ సమస్య ఏర్పడి చివరకు అది గుండెపోటుకు దారితీసింది. ఇదే వైర్‌సతో పోరాడుతూ ఆయన ప్రాణాలు విడిచారు. అదే సమయంలో ఆ డాక్టర్‌ కుమార్తెకు కూడా వైరస్‌ (COVID-19) సోకడంతో వానగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.

Heartbreaking testimony of Dr. Bhagyaraj

ఆయన పార్థివదేహాన్ని కిల్పాక్‌లో ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికలో ఖననం చేయాలని భావించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాక- దాన్ని అన్నానగర్‌ ప్రాంతంలో ఉన్న కిల్పాక్‌ సిమెట్రీ వైపు ఓ అంబులెన్స్‌లో తీసికెళుతున్నపుడు స్థానికులు అడ్డుకున్నారు. ఆ మృతదేహాన్ని ఖననం చేస్తే ఆ ప్రాంతమంతా వైరస్‌ చుట్టుముడుతుందని అక్కడివారు ఖననాన్ని అడ్డుకున్నారు. ఆ అంబులెన్స్‌పై ఏకంగా రాళ్లు రువ్వుతూ నానా రభస (Mob Attack) చేశారు. కట్టెలతో దాడికి దిగారు.

Ians Tweet

ఈ సంఘటనలో అంబులెన్స్‌ సిబ్బంది ఇద్దరు, డాక్టర్‌ మృతదేహంపాటు వెళ్ళిన ఇద్దరు తీవ్రంగా గాయ పడ్డారు. స్థానికుల దాడితో భీతిల్లిన సిబ్బంది డాక్టర్‌ మృతదేహాన్ని అంబులెన్స్‌లోనే ఆ డాక్టర్‌కు చెందిన ఆస్పత్రికి చేర్చేందుకు బయలుదేరి మార్గమధ్యలో కీల్పాక్‌ వైద్యకళాశాల ఆస్పత్రిలో గాయపడిన నలుగురు చికిత్స కోసం చేరారు. డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్, వైద్యం చేస్తూ డాక్టర్ మృతి

ఆ డాక్టర్‌తో పాటు వచ్చిన మరో డాక్టర్‌ బలవంతంగా అంబులెన్స్‌ను వేరే చోటికి తీసుకుపోయారు.ఆదివారం ఉదయం మరణించిన ఆ డాక్టర్‌ మృతదేహాన్ని అర్థరాత్రి వరకూ డాక్టర్‌ భాగ్యరాజ్‌ రహస్యంగా ఉంచారు. అప్పుడు దాన్ని తానే మరో ఇద్దరు వార్డు బాయ్‌ల సహకారంతో తీసికెళ్లి వేరే శ్మశాన వాటికలో గొయ్యి తీసి ఖననం చేశారు.

క్వారంటైన్‌కు గుంటూరు డాక్టర్లు, మెడికో సహా ఇద్దరు ఆర్‌ఎంపీలకు కరోనావైరస్ పాజిటివ్

ఆ లోపున ఈ విషయం తెలుసుకున్న గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గట్టి పోలీసు భద్రత మధ్య డాక్టర్‌ మృత దేహాన్ని అంబులెన్స్‌లో సోమవారం వేకువజాము ఒంటిగంట కు వెల్లంగాడు శ్మశానవాటికకు చేర్చారు. రెండు గంటలకు డాక్టర్‌ మృతదేహాన్ని ఆ శ్మశానవాటికలో ఖననం చేసి అందరూ తిరుగుముఖం పట్టారు.

ఆస్పత్రి డైరక్టర్‌ను కరోనా చంపేసింది, సామాన్యుల పరిస్థితి ఏంటీ, వైరస్ భారీన పడి మృతి చెందిన వుహాన్‌లోని ఆస్పత్రి డైరెక్టర్ లియూ చిమింగ్

అతి రహస్యంగా ఈ తంతు నడిపించాల్సిన దుస్థితి ఏర్పడింది. దీన్ని తన సెల్‌ఫోన్‌లోనే వీడియో తీసి డాక్టర్‌ భాగ్యరాజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కొవిడ్‌ రోగులకు చికిత్స చేసే డాక్టర్ల పరిస్థితి ఇదీ... అని వివరించారు. ఈ వీడియో దేశమంతా వైరల్‌ అయింది. ఈ ఘటనపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) తీవ్రంగా మండిపడింది.

Dear doctors please take care of yourself

‘‘మరణంలో గౌరవం ఇవ్వాలి.. అందునా ఇలాంటి వారికి! అంత్యక్రియలకు వీల్లేదంటారా? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?’’ అని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు రంజన్‌ శర్మ ఓ ప్రకటనలో దుమ్మెత్తి పోశారు. ‘మమ్మల్ని కరోనా వారియర్స్‌ అంటూ ప్రధాని మోదీ గౌరవించారు. ప్రజలకు ఇలాంటివి పట్టవా? రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తాయా’ అని నిలదీశారు.

డాక్టర్‌ మృతదేహాన్ని శ్మశానవాటికలోకి అనుమతించకుండా అడ్డుకున్నందుకుగాను 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు విధులకు ఆటంకం కలిగించడం, హింసకు పాల్పడటం, ప్రభుత్వ వాహనంపైదాడి జరుపటం తదితర నేరారోపణలపై వీరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా వుండగా కరోనా వైరస్‌ బారిన పడి మృతిచెందే వారిని ఖననం లేదా దహనం చేయడానికి తగిన స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఆయన ఓ ప్రకటన జారీ చేశారు. కరోనా వైరస్‌ బారినపడి మృతి చెందినవారిని శ్మశానవాటిక లో అనుమంతించకపోయినట్టయితే తనకు చెందిన ఆండాళ్‌ అళగర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని శ్మశానవాటికగా ఉపయోగించుకోవచ్చునని విజయకాంత్‌ ఆ ప్రకటనలో తెలిపారు. నగరంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు డాక్టర్లను ఖననం చేయడానికి అనుమతించక స్థానికులు అంబులెన్స్‌ సిబ్బందిపై దాడికి దిగటం విచారకరమని అన్నారు.