Amaravati, April 15: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం నెల్లూరు జిల్లాలో తొలి కరోనా మరణం (Nellore First Death) నమోదైంది. కరోనా పాజిటివ్‌తో (Coronavirus) తీవ్ర అస్వస్థతకు గురైన నెల్లూరు ఆర్థోపెడిక్ డాక్టర్ (Nellore orthopedic Doctor) చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా ఏపీలో కరోనాతో ఓ డాక్టర్ చనిపోవడం ఇదే మొదటిసారి.
డాక్టర్‌పై కరోనా పేషెంట్ బంధువుల దాడి
ఆర్ధోపెడిస్ట్ అయిన డాక్టర్ ఈమధ్యే నెల్లూరులో కొత్త ఆస్పత్రి ప్రారంభించాడు. మొదట్లో అస్వస్థత కు గురై నెల్లూరులో ఓ ప్రముఖ అసుపత్రిలో చికిత్స పొందాడు. తర్వాత అయన పరిస్థితి సీరియస్ గా వుండటంతో కరోనా ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఆ తర్వాత చెన్నై అపోలోకు తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో అయన మరణించనట్లు ఏపి ఐఎంఏ తెలిపింది.
ముంబై బాంద్రాలో వలస కార్మికుల ఘోష
అయితే డాక్టర్ భౌతిక కాయానికి అంత్యక్రియల వ్యవహారం వివాదంగా మారింది. ఆయన దహన సంస్కారాలకు అక్కడి లోకల్ వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అక్కడ దహనం చేయడానికి వీలు లేదన్నారు. దీనికోసం కూడా కార్పొరేషన్ సిబ్బంది సుమారు 12 గంటలపాటు యుద్ధమే చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు భౌతిక కాయంతో వాహనంలో బయలుదేరారు. తొలుత అంబత్తూరు శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ తెలుగువారు ఎక్కువగా ఉంటారు! పెద్దగా అభ్యంతరాలు ఉండవని భావించారు.
39 లక్షల రైల్వే టికెట్లు రద్దు, ఇప్పటికే రైల్వే టికెట్ బుక్ చేసుకున్నవారికి మొత్తం రీఫండ్
కానీ స్థానికులు అడ్డుకున్నారు. చివరికి కాటికాపర్లు కూడా వెళ్లిపోయారు. మూడు గంటలు విఫలయత్నం చేసిన సిబ్బంది.. అక్కడి నుంచి పెరంబదూర్ శ్మశాన వాటిక చేరుకున్నారు. అక్కడా ఇదే పరిస్థితి! ప్రజలు తిరగబడినంత పని చేశారు. చివరికి... రాత్రి 8 గంటల సమయంలో పోరూరు శ్మశాన వాటికలో దహనం చేశారు. దగ్గరుండి కడసారి వీడ్కోలు పలకాల్సిన కుటుంబ సభ్యులు వీడియో కాల్ ద్వారా ఆఖరు ఘట్టాన్ని చూస్తూ కన్నీరు పెట్టుకున్నారు.
గుంటూరులో కరోనా కల్లోలం, వంద దాటిన కరోనా కేసులు
కాగా ప్రభుత్వ అసుపత్రిలో మరణించిన వారికి మాత్రమే కార్పోరేషన్ సిబ్బంది అంత్యక్రియలు చేస్తారని, డాక్టర్ అంత్యక్రియలపై కేంద్రం చెప్పినట్టు నడుచకుంటామని.. తమిళనాడు అధికారులు చెబుతున్నారు. ఈ వైద్యుడి మరణంపట్ల ఐఎంఏ ఏపీ విభాగం విచారం వ్యక్తం చేసింది. వైద్య సిబ్బంది పూర్తి జాగ్రత్తలతో చికిత్సలు అందించాలని సూచించింది. కాగా ఆయన భార్యకూ కరోనా సోకడంతో ఆమెను క్వారంటైన్‌కు పంపించారు. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువు (అన్న, అక్క, బావ)ల కుటుంబ సభ్యులందరినీ హోం క్వారంటైన్‌లో పెట్టారు.